సెన్సెక్స్ 124 పాయింట్లు పైకి
గత నష్టాల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకోవడంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 31,369 వద్ద ముగియగా; నిఫ్టీ 36.95 పాయింట్లు లాభపడి 9
గత నష్టాల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు కోలుకోవడంతో గురువారం దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 31,369 వద్ద ముగియగా; నిఫ్టీ 36.95 పాయింట్లు లాభపడి 9674.55 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం(1.57%), ఎఫ్ఎమ్‌సీజీ(0.75%), పీఎస్‌యూ(0.68%), బ్యాంకింగ్(0.45%) లాభాల్లో పయనించగా; మరో వైపు చమురు,సహజవాయు రంగం(0.38%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.32%), ఐటీ(0.26%), టెక్నాలజీ(0.16%) నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(2.15%), ఐటీసీ(1.72%), కోల్ ఇండియా(1.52%), భారతీ ఎయిర్‌టెల్(1.36%) ముందుండగా; నష్టపోయిన వాటిలో బజాజ్ ఆటో(1.52%), ఎమ్ అండ్ ఎమ్(1.3%), సన్ ఫార్మా(1.04%), యాక్సిస్ బ్యాంక్(0.93%), ఓఎన్‌జీసీ(0.77%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications