తన ప్యాసెంజర్ వాహన ధరలను 12 శాతం వరకూ తగ్గించనున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది. జీఎస్టీ ప్రభావంతో ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మోడల్, రకం బట్టి రూ.3300 నుం
తన ప్యాసెంజర్ వాహన ధరలను 12 శాతం వరకూ తగ్గించనున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది. జీఎస్టీ ప్రభావంతో ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మోడల్, రకం బట్టి రూ.3300 నుంచి మొదలుకొని రూ.2,17,000 వరకూ తగ్గిస్తున్నామని కార్ల తయారీ కంపెనీ అధ్యక్షుడు(ప్యాసెంజర్ వాహన విభాగం) మయాంక్ పరీక్ చెప్పారు.
"జీఎస్టీ ప్రభావంతో వస్తున్న ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా కొనుగోళ్లు జరిపే ప్యాసెంజర్ విభాగంపై దృష్టి పెడుతున్నాం. దేశీయ మార్కెట్లో ప్యాసెంజర్ వాహన విభాగంలో జీఎస్టీ వల్ల కలిగిన మిశ్రమ ప్రభావం కారణంగా అమ్మకాలపై ప్రభావం పడింది " అని పరీక్ అన్నారు.

జూన్ 2016లో ప్యాసెంజర్ వాహన అమ్మకాల సంఖ్య 12,482 యూనిట్లుగా ఉండగా; ఈ ఏడాది జూన్‌లో ఆ సంఖ్య 10 శాతం తగ్గి 11,176 యూనిట్లుగా నమోదు అయింది. అయితే అమ్మకాల్లో నెలకొన్న ఈ క్షీణత తాత్కాలికమేనని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. త్రైమాసిక పరంగా చూస్తే పరిస్థితి బాగానే ఉండగలదని 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉన్న దానికంటే 11% మెరుగుదల ఈ ఏడాది అదే త్రైమాసికంలో ఉన్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications