For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

36 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్, వాహ‌న త‌యారీ కంపెనీలు ఇచ్చిన మ‌ద్ద‌తుతో మార్కెట్లు లాభాల‌ను నిల‌బెట్టుకున్నాయి. జీఎస్టీని దాదాపుగా మార్కెట్లు స్వాగ‌తించిన‌ట్లు క‌న‌ప‌డిన‌ప్ప‌టికీ కంపెనీల తుది ఫ‌లితాలు ప్ర‌తి

|

రోజు మొత్తం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ఊగిస‌లాడిన మార్కెట్లు చివరికి సానుకూలంగా ముగిశాయి. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్, వాహ‌న త‌యారీ కంపెనీలు ఇచ్చిన మ‌ద్ద‌తుతో మార్కెట్లు లాభాల‌ను నిల‌బెట్టుకున్నాయి. జీఎస్టీని దాదాపుగా మార్కెట్లు స్వాగ‌తించిన‌ట్లు క‌న‌ప‌డిన‌ప్ప‌టికీ కంపెనీల తుది ఫ‌లితాలు ప్ర‌తిఫలించే రిపోర్టుల మీదే కొత్త పన్ను ప్ర‌భావం ప్ర‌ధానంగా ఆధారప‌డి ఉంటుంది. జీఎస్టీ సానుకూల ప్ర‌భావం ఇంకా పూర్తిగా క‌న‌బ‌డ‌లేద‌ని విశ్లేష‌కులు చెపుతున్నారు. అన్ని ప్ర‌భావాల‌తో చివ‌ర‌కు బీఎస్ఈ సెన్సెక్స్ 35.77 పాయింట్లు లాభ‌ప‌డి 31,245.56 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 24.30 పాయింట్లు లాభ‌ప‌డి 9637.60 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

 సెన్సెక్స్‌

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లుపిన్ అత్య‌ధికంగా దాదాపు 4% లాభ‌ప‌డింది. దీంతో కంపెనీ షేరు ధ‌ర రూ.1084కు చేరింది. ప్యాసెంజ‌ర్ వాహ‌న ధ‌ర‌లు త‌గ్గించిన‌ట్లు ప్ర‌క‌టించడంతో టాటా మోటార్స్ షేర్ ధ‌ర 1% పెరిగి రూ.433గా ఉంది. జీఎస్టీ ప్ర‌భావంతో మ‌హీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధ‌ర 2% పెరిగి రూ.1383కు చేరింది.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో లుపిన్‌(3.84%), వేదాంత‌(2.41%), ఎమ్ అండ్ ఎమ్‌(2.20%), ఓఎన్‌జీసీ(1.81%), అల్ట్రాటెక్ సిమెంట్(1.71%) ఉండ‌గా ; మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ఐటీసీ(1.84%), ఇన్ఫోసిస్‌(1.17%), విప్రో(0.85%), భార‌తీ ఎయిర్‌టెల్(0.79%), హెచ్‌డీఎఫ్‌సీ(0.70%) ఉన్నాయి.

English summary

36 పాయింట్ల లాభంలో ముగిసిన సెన్సెక్స్‌ | markets ends with slight gains

The Sensex made a mild recovery to close 36 points higher at 31,245.56, backed by uninterrupted buying by domestic institutional investors amid positive global cues.The 50—share Nifty managed to maintain its key 9,600—mark and scaled a high of 9,643.65 before finally ending at 9,637.60, up 24.30 points, or 0.25 per cent.
Story first published: Wednesday, July 5, 2017, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X