స్నాప్‌డీల్ ఫ్లిప్‌కార్ట్ చేతుల్లోకి వెళుతుందా? లేదా...
స్నాప్ డీల్ ఆర్థిక కష్టాలను, ఫ్లిప్‌కార్ట్ ఊపును చూసి ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్నాప్‌డీల్‌ను కొనేస్తుందని భావించారు. అయితే ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు స్నాప్‌డీల్ వైపు నుంచి పూ
స్నాప్ డీల్ ఆర్థిక కష్టాలను, ఫ్లిప్‌కార్ట్ ఊపును చూసి ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్నాప్‌డీల్‌ను కొనేస్తుందని భావించారు. అయితే ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు స్నాప్‌డీల్ వైపు నుంచి పూర్తి అంగీకారం ఉన్నట్లు కనపడటం లేదు. స్నాప్‌డీల్ వాటాదారుల్లో కొంతమందికి ఇది ఇష్టం లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలకు సంబంధించి ఏమి జరుగుతున్నదో తెలుసుకుందాం.

ఊహించిన దాని కంటే తక్కువ ఆఫర్
స్నాప్‌డీల్(జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీకి సంబంధించి అన్ని వ్యవహారాలను బేరీజు వేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ గత వారంలో ఒక ఆఫర్‌తో వెళ్లింది. ఫ్లిప్‌కార్ట్ ఓపెనింగ్ బిడ్ అయిన 1 బిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువని, దీంతో స్నాప్‌డీల్ దాన్ని తిరస్కరించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు వెల్లడించారు.

సంప్రదింపులు కొనసాగుతాయ్
అయితే డీల్ పూర్తిగా క్లోజ్ కాలేదని సంప్రదింపులు జరుగుతాయని అంటున్నారు.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ కేవలం స్నాప్‌డీల్ మార్కెట్ బిజినెస్‌కు సంబంధించింది మాత్రమేనని చెబుతున్నారు. అందులో స్నాప్‌డీల్‌కు చెందిన ఫ్రీచార్జ్, వుక్లాన్ ప్రస్తావన లేదని వాటిని ప్రత్యేకంగా అమ్మకానికి పెడతారని తెలుస్తోంది.

సాప్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్ ఏం చేస్తాయో!
స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల్లో అతిపెద్ద పెట్టుబడిదార్లుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబర్ మేనేజ్‌మెంట్ తుది అమ్మకం ధరపై తుది సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అంతే కాకుండా సాఫ్ట్‌బ్యాంక్ తదుపరి ప్రణాళికల్లో సైతం ఉంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థలో టైగర్ గ్లోబర్ వాటాలో కొంత శాతాన్ని చేజిక్కుంచుకునేందుకు సైతం సాప్ట్‌బ్యాంక్ యోచిస్తోంది.

ఫ్రీచార్జ్ స్నాప్‌డీల్ చేతిలోకి
ఏప్రిల్ 2015 నుంచి స్నాప్‌డీల్ ఫ్రీచార్జ్ సంస్థను కొనేసి దాని నిర్వహణను చూస్తోంది. పేటీఎమ్ ఆన్‌లైన్ చెల్లింపుల్లో ఆక్సిజన్, ఫ్రీచార్జ్ సంస్థలను తోసిరాజని దూసుకెళుతోంది. ఒక దశంలో ఫ్రీచార్జ్‌ను 40-50 మిలియన్ డాలర్లకు పేటీఎమ్ కొంటుందని మింట్ ఒక వార్తను ప్రచురించింది. 2016 ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫ్లిప్‌కార్ట్లోకి అప్పట్లో వరుసగా 50 మిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టారు.


Click it and Unblock the Notifications