For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్‌బీఐ నుంచి 200 రూపాయ‌ల నోటు

పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ప్ర‌జ‌ల వైపు నుంచి బ్యాంకుల్లో జ‌మ‌య్యే న‌గ‌దు త‌గ్గుతోంది. నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని.. కొత్తగా రూ. 200 నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇ

|

పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ప్ర‌జ‌ల వైపు నుంచి బ్యాంకుల్లో జ‌మ‌య్యే న‌గ‌దు త‌గ్గుతోంది. నోట్ల కొరతను దృష్టిలో పెట్టుకుని.. కొత్తగా రూ. 200 నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు...

1. ఆర్బీఐ నిర్ణ‌యం

1. ఆర్బీఐ నిర్ణ‌యం

నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా... అవి అనుకున్నంత మేరకు లేకపోవడం చిన్న నోట్ల కొరత కొనసాగుతుండడంతో రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

2. కొత్త నోట్ల ప్రింటింగ్‌

2. కొత్త నోట్ల ప్రింటింగ్‌

కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి అనుమ‌తులు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ వ‌ర్గాల ప్ర‌కారం దేశంలో లిక్విడిటీని పెంచేందుకు మైసూర్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో కొత్త రూ.200 నోట్లు ముద్రిస్తున్నార‌ని దీని ద్వారా న‌గ‌దు కొర‌త స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు కొంత వ‌ర‌కైనా కేంద్రం ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయ‌ని స‌మ‌చారం.

3. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌

3. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌

గ‌తేడాది న‌వంబ‌రులో కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద విలువ క‌లిగిన రూ.500, రూ. 1000 నోట్ల‌ను ఒక్క‌సారిగా మార్చాల‌ని పాత నోట్ల‌న్నంటినీ ర‌ద్దు చేసింది. కొన్ని అంచ‌నాల ప్ర‌కారం దాదాపు ఈ పెద్ద నోట్లే 86 శాతం వ‌ర‌కూ మొత్తం కరెన్సీ నోట్ల‌లో ఉన్నాయి. నోట్ల ర‌ద్దు త‌ర్వాత దాదాపు 50 రోజులు ప్ర‌జ‌లు క‌రెన్సీ కోసం ఇబ్బంది ప‌డ్డారు.

 4. రూ.200 నోటుపై నిపుణుల మాట‌

4. రూ.200 నోటుపై నిపుణుల మాట‌

రూ.200 నోటు చ‌లామ‌ణీలోకి రావ‌డం ద్వారా లావాదేవీలు సులువు అవుతాయి. ఈ నోటు ముద్ర‌ణ ద్వారా మ‌రోసారి నోట్ల ర‌ద్దు చేస్తారేమోన‌ని సోష‌ల్ మీడియాలో చ‌లోక్తులు సాగుతున్నాయి. 22 ఏళ్ల త‌ర్వాత ఈ మ‌ధ్యే ప్ర‌భుత్వం రూపాయి నోటును మ‌ళ్లీ చ‌లామ‌ణీలోకి తెచ్చింది. 1994లో రూపాయి నోటును నిలిపేశారు. త‌ర్వాత నెమ్మ‌దిగా రూ.2, రూ.5 నోటు ముద్ర‌ణ‌ను ఆపేశారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా నోట్ల ముద్ర‌ణ‌ను తీర్చిదిద్దేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు జ‌రుగుతుంటాయ‌ని ఈ వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన అధికారి ఒక‌రు చెప్పారు.

Read more about: rbi currency notes banking
English summary

ఆర్‌బీఐ నుంచి 200 రూపాయ‌ల నోటు | by the end of 2017 one can see 200 rupee note

he Reserve Bank of India (RBI) is expected to introduce Rs 200 notes in the coming months to ease pressure on lower-denomination currencies that are in short supply. The new notes of Rs 200 should be out before the end of 2017.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X