స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
మూడు వరుస సెషన్ల లాభాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల దిశగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11.83 పాయింట్లు క్షీణించి 31,209.79 వద్ద ముగియగా, మరో సూచీ ఎన్ఎసీఈ నిఫ్టీ 1.7 పాయింట్ల
మూడు వరుస సెషన్ల లాభాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల దిశగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11.83 పాయింట్లు క్షీణించి 31,209.79 వద్ద ముగియగా, మరో సూచీ ఎన్ఎసీఈ నిఫ్టీ 1.7 పాయింట్లు నష్టపోయి 9613 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్ కేర్(0.73%), ఎఫ్ఎమ్‌సీజీ(0.66%), స్థిరాస్తి(0.64%), ఆటో(0.48%) ఎక్కువగా నష్టపోగా; మరో వైపు చమురు,సహజ వాయు(0.56%), ఐటీ(0.33%), టెక్నాలజీ(0.11%), లోహ(0.06%) రంగాలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో రిలయన్స్(2.79%), హెచ్‌డీఎఫ్‌సీ(1.28%), కొటక్ బ్యాంక్(1.1%), ఇన్ఫోసిస్(0.96%), అదానీ పోర్ట్స్(0.87%) ఉండగా నష్టపోయిన వాటిలో యాక్సిస్ బ్యాంక్(2.08%), హీరో మోటోకార్ప్(2.04%), డాక్టర్ రెడ్డీస్(1.88%), ఐటీసీ(1.52%), సిప్లా(1.28%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications