జీఎస్టీ తర్వాత: గ్యాస్ ధర రూ.32 పెంపు
జీఎస్టీ ప్రభావంతో కొన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా కొన్ని వస్తు,సేవల ధరలు తగ్గుతున్నాయి. జీఎస్టీ ప్రభావం ఎల్‌పీజీపై సైతం పడింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఎల్‌పి
జీఎస్టీ ప్రభావంతో కొన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా కొన్ని వస్తు,సేవల ధరలు తగ్గుతున్నాయి. జీఎస్టీ ప్రభావం ఎల్‌పీజీపై సైతం పడింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఎల్‌పిజిని 5 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలోకి తేవడంతోపాటు, సబ్సిడీలో కూడా కోత విధించనున్నట్లు తెలుస్తోంది. గతంలో అమల్లో ఉన్న వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో సిలిండర్ ధర రూ. 12 నుంచి రూ. 15కు పెరగనుండగా, ఇక జూన్ నుంచి సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీ కూడా తగ్గించనుండటంతో గ్యాస్ ధర ఒక్కింటికీ రూ. 32 వరకూ పెరగనున్నట్లు సమాచారం.

ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హరిత ఇంధనంపై వ్యాట్ ఉండేది కాదు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 2 నుంచి 4 శాతం వరకు విధించేవారు. కానీ, ఇప్పుడు జీఎస్టీ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లోనూ 5 శాతం పన్ను విధించాల్సిందే. గృహ వినియోగదారులకు ఆగ్రాలో ఇప్పటివరకూ 119.85 రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇక నుంచి ఆ మొత్తాన్ని రూ. 107కు తగ్గించనున్నట్టు ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి విపుల్ పురోహిత్ తెలిపారు. ఆయన లెక్కల ప్రకారం మొత్తంగా రూ. 32 పెరగనున్నది. జీఎస్టీ అమలులోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ దీని అమలుకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు భారీగా పెరగనున్న ధరలపై మాత్రం ప్రభుత్వం నోరుమెదపడంలేదు. సేవల ఛార్జీలను 18 శాతానికి పెంచడంతో వినియోగదారులు అదనపు సిలిండర్, ఇన్‌స్టలేషన్, డాక్యుమెంటేషన్‌కు గతంలో కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications