జూన్ 30 అర్థరాత్రి దాటినప్పటి నుంచి జీఎస్టీ అమలు ప్రారంభమైంది. ప్రభుత్వం పెద్దగా సన్నాహక ఏర్పాట్లు లేనప్పటికీ జీఎస్టీని రుద్దుతున్నట్లు చాలా వర్గాలు విమర్శిస్తున్నాయి. వ్యాపారులకోసం క
జూన్ 30 అర్థరాత్రి దాటినప్పటి నుంచి జీఎస్టీ అమలు ప్రారంభమైంది. ప్రభుత్వం పెద్దగా సన్నాహక ఏర్పాట్లు లేనప్పటికీ జీఎస్టీని రుద్దుతున్నట్లు చాలా వర్గాలు విమర్శిస్తున్నాయి. వ్యాపారులకోసం కేటాయించిన ప్రావిజనల్ నంబర్లలో తప్పులు, జీఎస్టీఎన్ నెట్‌వర్క్లో స్వల్పలోటు పాట్ల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. అయితే రెవెన్యూ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సీబీఈసీ(కేంద్ర ఎక్సైజ్,కస్టమ్స్ సుంకం) ఎన్నో సాధారణ సందేహాలకు సమాధానాలను ఇస్తూ వస్తోంది. వీటిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ మొదలుకొని, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, పాయింట్ ఆఫ్ ట్యాక్స్ వంటి వివిధ అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాపార, వినియోగదారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రెవెన్యూ వర్గాలు ఉంటున్నాయి.

డిజిటల్ మార్గాల్లో ఎన్నో వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలకు వచ్చే సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తూ, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తూ వస్తున్నారు. ఇంతే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ ప్రజలను చేరుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.
జీఎస్టీ హెల్ప్‌డెస్క్
ఈమెయిల్: [email protected]
ఫోన్ నంబర్- 1800 1200 232
జీఎస్టీ నెట్వర్క్ హెల్ప్ డెస్క్
ఈమెయిల్: [email protected]
ఫోన్ నంబర్- 0120 4888999
ట్విట్టర్ పేజీలలో @askGST_GOI, @askGSTech
ఇంకా అదనపు సందేహాలుంటే నేరుగా పన్ను చెల్లింపు దారులు 0120-4888999, పన్ను అధికారులు 0124-4479900 నంబర్లలో సంప్రదించవచ్చు. ఇంకా ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఫేస్‌బుక్,ట్విట్టర్‌లలో మీరు నేరుగా ప్రశ్నలను సంధిస్తే విలువైన వాటికి ఆ శాఖ స్పందించే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం తర్వాత చేపడుతున్న అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉండవని చెప్పలేం. అంత మాత్రాన ప్రతి చిన్న దానికి ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టకుండా సమస్యలకు సమాధానాలు రాబట్టేందుకు ఉన్న మార్గాల గురించి ఆలోచించి జీఎస్టీ అమలును ప్రజలు విజయవంతం చేస్తే మంచిది. జీఎస్టీపైన మీ సమస్యలను,విశ్లేషణలను, ఆలోచనలను కింద కామెంట్లలో రాయండి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications