బీమా హామీ మొత్తం అంటే ఏమిటి?
బీమా పాలసీకి సంబంధించి పాలసీదారుకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని బీమా హామీ మొత్తం అంటారు. ఒక వ్యక్తి బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఈ బీమా హామీ మొత్తం అనేది నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మాములుగా ఏజ
బీమా పాలసీకి సంబంధించి పాలసీదారుకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని బీమా హామీ మొత్తం అంటారు. ఒక వ్యక్తి బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఈ బీమా హామీ మొత్తం అనేది నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మాములుగా ఏజెంట్లు చెప్పే దాన్ని సమ్ అస్యూర్డ్‌గా పరిగణిస్తారు. పాలసీదారు అకస్మాత్తుగా లేకుండా పోతే అతని లేనప్పుడు కుటుంబ ఆర్థిక లోటును బీమా పాలసీయే తీరుస్తుందని గుర్తుంచుకోవాలి. మీ వార్షిక ఖర్చులకు 12 నుంచి 15 సార్లు, లేదా వార్షిక ఆదాయానికి 8 నుంచి 10 రెట్లు ఉండేలా బీమా హామీ మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా ఆర్థిక ప్రణాళిక నిపుణులు సూచిస్తారు.

సాధారణంగా తక్కువ ప్రీమియంలో ఎక్కువ బీమా హామీ మొత్తం ఉండేలా లభించే ఇన్సూరెన్స్ పాలసీల్లో టర్మ్ పాలసీలు ఎక్కువగా ఉంటాయి. అదే పెట్టుబడి కలగలిపి ఉండే పాలసీల్లో బీమా హామీ మొత్తం తక్కువగా ఉంటుంది. అంటే పాలసీ కవరేజీ అంత ఎక్కువగా ఉండదు. అందుకే బీమా నియంత్రణ సంస్థ ఈ పాలసీలకు సైతం కనీస బీమా హామీ మొత్తాన్ని నిర్ణయించింది. 10 ఏళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న పాలసీల విషయంలో కనీస బీమా హామీ మొత్తం వార్షిక ప్రీమియంకు 5 రెట్లు ఉంటుంది. అంతే కాకుండా ఏ సమయంలోనైనా పాలసీ దారు మరణిస్తే చెల్లించే బీమా హామీ మొత్తం పాలసీకి చెల్లించిన ప్రీమియంలకు 105% కంటే తక్కువ ఉండకూడదు. ఉదాహరణకు ఒక పాలసీదారు రూ.10 వేల ప్రీమియం కడుతున్నాడు, అది రూ.50 వేల బీమా హామీ మొత్తం కలిగిన పాలసీ అనుకుందాం. ఒక వేళ పాలసీదారు 6వ సంవత్సరంలో మరణిస్తే బీమా సంస్థ రూ.63 వేలను చెల్లిస్తుంది.(Rs.60,000లో 105%)


Click it and Unblock the Notifications