64 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. జూలై సిరీస్ తొలి రోజు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనై చివరికి ఆశావహంగానే ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్స
ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. జూలై సిరీస్ తొలి రోజు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనై చివరికి ఆశావహంగానే ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 64 పాయింట్లు పుంజుకుని 30,922 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 17 పాయింట్లు బలపడి 9,521 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ(2.24%), కన్సూమర్ డ్యూరబుల్స్(2.07%), హెల్త్ కేర్(1.47%), పవర్(0.56%) లాభపడగా; మరో వైపు స్థిరాస్తి(0.51%), ఆటో(0.32%), ఇన్‌ఫ్రా(0.23%), చమురు, సహజ వాయు(0.08%) రంగాలు నష్టపోయాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో ఐటీసీ(4%), సన్‌ఫార్మా(2.97%), టాటా స్టీల్(1.8%), సిప్లా(1.76%), డా రెడ్డీస్(1.59%) ఉండగా; హీరో మోటోకార్ప్(1.25%), ఐసీఐసీఐ బ్యాంక్(1.23%), హెచ్‌డీఎప్‌సీ(0.96%), రిలయన్స్(0.91%), భారతీ ఎయిర్‌టెల్(0.9%) నష్టపోయిన వాటిలో ముందున్నాయి.


Click it and Unblock the Notifications