For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీపై అభ్యంత‌రాలా: జులై 1 త‌ర్వాతే

గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొన్ని వ‌ర్గాల నుంచి అక్క‌డ‌క్క‌డ అభ్యంత‌రాలు ఉంటూనే ఉన్నాయి. ఫ‌ర్నిచ‌ర్ వ్యాపారులు, వ‌స్త్ర వ్యాపారులు,

|

గ‌డువు స‌మీపిస్తుండ‌టంతో జులై 1 నుంచి జీఎస్టీ అమ‌లుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొన్ని వ‌ర్గాల నుంచి అక్క‌డ‌క్క‌డ అభ్యంత‌రాలు ఉంటూనే ఉన్నాయి. ఫ‌ర్నిచ‌ర్ వ్యాపారులు, వ‌స్త్ర వ్యాపారులు, రోడ్డు నిర్మాణ‌దారులు, వ‌జ్రాల వ్యాపారులు వివిధ రూపాల్లో త‌మ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. జీఎస్టీ విధింపుపై అంతిమ నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్‌కు ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లు విన‌తుల‌ను స్వీక‌రించిన జీఎస్టీ కౌన్సిల్ జూన్ 11 నాడు 66 వ‌స్తువుల‌కు సంబంధించి రేట్ల‌ను త‌గ్గించింది. త‌ద్వారా చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్ల‌కు త‌క్కువ ప‌న్ను ఉండేలా చూసింది.

 జీఎస్టీ కౌన్సిల్‌కు అభ్యంత‌రాలు తెల‌పొచ్చు!

జీఎస్టీని జూన్ 30 అర్థ‌రాత్రి నుంచి అమ‌లు చేయ సంక‌ల్పించిన భాజ‌పా ప్ర‌భుత్వం అంత‌కు ముందుగా కౌన్సిల్ స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిపేందుకు నిర్ణ‌యించింది. అయితే రెవెన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ అధియా నేతృత్వంలో ఏదైనా అత్య‌వ‌స‌ర నిర్ణ‌యాలు తీసుకునేందుకు వీలుగా జీఎస్టీ నిర్వ‌హ‌ణ క‌మిటీ(జీఐసీ)ని సైతం ఏర్పాటు చేశార‌ని తెలుస్తోంది. రాయితీల‌కు సంబంధించి కౌన్సిల్ వ‌ద్ద‌కు వ‌చ్చే అభ్యంత‌రాల‌ను సావ‌ధానంగా వింటున్న‌ప్ప‌టికీ చివ‌ర నిమిషంలో ప‌న్ను చెల్లింపుల‌ను ప్రభావితం చేసేలా కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేలా క‌నిపించ‌డం లేదు. మ‌రో వైపు జీఎస్టీకి సంబంధించి ఇప్ప‌టిదాకా జ‌మ్మూ అండ్ కాశ్మీర్ మాత్ర‌మే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయ‌లేదు. ఏక‌గ్రీవంగా జీఎస్టీని ఆమోదించేందుకు జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

Read more about: gst జీఎస్టీ
English summary

జీఎస్టీపై అభ్యంత‌రాలా: జులై 1 త‌ర్వాతే | gst council going to consider more pleas after july 1st

The goods and services tax (GST) Council will consider more requests for relief on GST rates and compliance requirement from businesses and traders after the rollout of the nation’s biggest indirect tax reform on 1 July.
Story first published: Thursday, June 29, 2017, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X