ఇంటి అద్దె భత్యంతోపాటు ఇతర అలవెన్సుల్లో పెంపుదల కోసం ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో 47 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
ఇంటి అద్దె భత్యంతోపాటు ఇతర అలవెన్సుల్లో పెంపుదల కోసం ఏడాదికాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో 47 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం)తోపాటు ఇతర అలవెన్సులపై 7వ వేతన సంఘం చేసిన సిఫారసులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలివే...

మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ
క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో వచ్చే కొత్త జీతభత్యాల అమలు జులై 1 నుంచే అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వంలోని 34 లక్షల మందితో పాటు, 14 లక్షల మంది రక్షణ శాఖలో పనిచేసే వారికి ఇవి వర్తిస్తాయి.

ఇంటి అద్దె భత్యం
హెచ్ ఆర్ ఏ చెల్లింపు x,y,z నగరాల్లో వరుసగా 24%, 16%, 8% మేర పెరగనుంది.
హెచ్ఆర్‌ఏ కనీస పెంపు రూ.1800 పైనే ఉంటుంది.
దీంతో 7.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

సియాచిన్ అలవెన్సు
సియాచిన్ ప్రపంచంలోనే ప్రమాదకరమైన యుద్ద క్షేత్రం.
వారికి సంబంధించి సియాచిన్‌లో పనిచేసే సైనికులకు అలవెన్సును రూ.14వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.
ఆఫీసర్ ర్యాంకులోని వారికి రూ.21 వేల నుంచి రూ.42,500కు పెంచారు.

పింఛను అలవెన్సు
పింఛనుదారులకు ఇచ్చే మెడికల్ అలవెన్సును రూ. 500 నుంచి రూ.1000కి పెంచారు.
ఇతర అలవెన్సులు సైతం పింఛనుదారులకు స్వల్పంగా పెంచారు.

నర్సులు, ఆసుపత్రుల్లోని మినీస్టిరియల్ స్టాఫ్
ప్రభుత్వం నర్సింగ్ అలవెన్సును రూ.4800 నుంచి రూ.7200కు పెంచారు.
ఆపరేషన్ థియేటర్ అలవెన్సు రూ.360 నుంచి రూ.540కి పెరిగింది.
హాస్పిటల్ పేషెంట్ కేర్ అలవెన్సు, పేషెంట్ కేర్ అలవెన్సులను సైతం స్వల్పంగా పెంచారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications