నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 124 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 9500 కంటే దిగువన స్థిరపడింది. బ్యాంకుల ఎన్‌పీఏలకు సంబంధించి ప్రభుత్వ
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా బుధవారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 124 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 9500 కంటే దిగువన స్థిరపడింది. బ్యాంకుల ఎన్‌పీఏలకు సంబంధించి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు, జీఎస్టీపైన కమ్ముకున్న అనిశ్చితి కారణంగా దేశీయ సూచీలు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 123.93 పాయింట్లు లాభపడి 30,834.32 వద్ద ముగియగా, నిఫ్టీ 20 పాయింట్లు 9491 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.62%), విద్యుత్ రంగం(0.64%), స్థిరాస్తి(0.56%), టెక్నాలజీ(0.31%) లాభపడగా కన్సూమర్ డ్యూరబుల్స్(1.22%), చమురు,సహజ వాయు(0.79%), ఎఫ్ఎమ్‌సీజీ(0.67%), మూలధన వస్తువులు(0.25%) నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో టాటా స్టీల్(1.85%), భారతి ఎయిర్‌టెల్(1.49%), విప్రో(1.17%), పవర్ గ్రిడ్(1.05%), ఐసీఐసీఐ(1.01%) ఉండగా; రిలయన్స్(2.6%), ఏసియన్ పెయింట్స్(2.12%), హెచ్‌డీఎఫ్‌సీ(1.38%), ఓఎన్‌జీసీ(1.13%), ఐటీసీ(1.12%) నష్టపోయిన వాటిలో ముందున్నాయి.


Click it and Unblock the Notifications