అక్టోబర్ డిమాండ్‌కు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్న రైల్వే
అక్టోబర్‌లో విపరీతంగా ఉండే రైల్వే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటి నుంచి సిద్దమవుతోంది. కేటరింగ్‌కు ట్రాలీ సర్వీస్, మర్యాదగా వ్యహరించే స్టాఫ్, వినోదం వంటి అంశాలను రాజధాన
అక్టోబర్‌లో విపరీతంగా ఉండే రైల్వే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రైల్వే శాఖ ఇప్పటి నుంచి సిద్దమవుతోంది. కేటరింగ్‌కు ట్రాలీ సర్వీస్, మర్యాదగా వ్యహరించే స్టాఫ్, వినోదం వంటి అంశాలను రాజధాని, శతాబ్ది రైళ్లలో ఉండేలా చూసుకుంటోంది. మొత్తం 30 రైళ్లు(15 రాజధాని, 15 శతాబ్ది) వాడే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రూ.25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు. రైల్వే శాఖ చేపడుతున్న 3 నెలల కార్యక్రమానికి ప్రాజెక్ట్ స్వర్ణ్ అని పేరుపెట్టారు. ఈ రైళ్లలో ముఖ్యంగా క్యాటరింగ్, సమయపాలన, టాయిలెట్ శుభ్రత వంటి అంశాలపై అధికారులకు ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండటంతో దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.

మొత్తం ప్రాజెక్టు స్వర్ణ్‌లో ఉన్న రైళ్లలో ముంబయి, హౌరా, పట్నా, రాంచి, భువనేశ్వర్‌కు వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు; హరా-పూరి, న్యూఢిల్లీ-చంఢీఘడ్, న్యూఢిల్లీ-కాన్పూర్, హరా-రాంచి, ఆనంద్ విహార్-కత్గోడమ్ మార్గాల్లో ఉండే శతాబ్ది ట్రైన్లు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టబోయే చర్యల్లో సమయపాలనను నిర్వహించడం, క్యాటరింగ్, కోచ్ శుభ్రత వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న రైల్వే అధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications