ఒక పక్క శుక్రవారం అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో ఆన్లైన్‌లో వస్తువులను అమ్మే సంస్థలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దీంతో ఈ-కామర్స్ కంపెనీలకు జీఎస్‌టీ అమలు విషయంలో వెసలు
ఒక పక్క శుక్రవారం అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో ఆన్లైన్‌లో వస్తువులను అమ్మే సంస్థలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దీంతో ఈ-కామర్స్ కంపెనీలకు జీఎస్‌టీ అమలు విషయంలో వెసలుబాటు లభించింది.

జీఎస్టీ కింద సరఫరాదార్లకు చెల్లింపులు చేసే విషయంలో 1 శాతం మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్) చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టపరిచింది. అదే విధంగా పరోక్ష పన్నుల కొత్త విధాన అమలుకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు), టీసీఎస్‌ల నిబంధనల అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది. కేంద్ర జీఎస్‌టీ(సీజీఎస్‌టీ) చట్టం కింద సంస్థలు పొందే వస్తువులు లేదా సేవలకు సరఫరాదార్లకు చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు అధిగమిస్తే 1 శాతం మేర టీసీఎస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దీన్ని పక్కనపెట్టారు. పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.20 లక్షల లోపు టర్నోవరు ఉన్న చిన్న వ్యాపారులు ఇ-కామర్స్ పోర్ట్‌ల్ ద్వారా వస్తువుల, సేవల విక్రయానికి జీఎస్‌టీ కింద నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. జీఎస్టీ వస్తే వ్యాపారులు ఎవరూ కూడా పన్ను తప్పించుకునే వీల్లేకుండా ఆన్‌లైన్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications