కష్టాల నుంచి గట్టెక్కేందుకు టాటా పవర్ ప్రణాళికలు రచించింది. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పవర్ ప్రాజెక్టులో 51 శాతం వాటాను దానినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రాలకు 1 ర
కష్టాల నుంచి గట్టెక్కేందుకు టాటా పవర్ ప్రణాళికలు రచించింది. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పవర్ ప్రాజెక్టులో 51 శాతం వాటాను దానినుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న గుజరాత్ లాంటి రాష్ట్రాలకు 1 రూపాయికే విక్రయిస్తామని టాటా పవర్ ప్రతిపాదించింది. రుణభారంతో పాటుగా నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం టాటా పవర్ ఈ ప్రతిపాదన చేసింది.

ప్రాజెక్టులో తాము కేవలం 49 శాతం వాటానే అట్టి పెట్టుకుని, విద్యుత్‌ను కొనుగోలు చేసే వారు గనుక అధిక ధరకు ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేసే పక్షంలో ఒక కాంట్రాక్టర్‌గా ప్రాజెక్టును నడుపుతామంటూ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటాపవర్‌కు చెందిన కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్ (సిజిపిఎల్) ఈ నెల ప్రారంభంలో గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు ఓ లేఖ రాసింది. ముంద్రా పవర్ ప్రాజెక్టు నష్టాలు రూ.6,457 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని సిజిపిఎల్ సిఈఓ కృష్ణకుమార్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సిజిపిఎల్‌కు ఇప్పటికే రూ.10,159 కోట్ల రుణ బకాయిలున్నాయని, ప్రాజెక్టు లాభదాయకం కారణం కాకపోవడంతో రుణదాతలు కొత్తగా రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో పాటు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి సైతం ఆ లేఖ కాపీలను పంపించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications