బెంగుళూరులో పెట్రోలు సైతం డోర్ డెలివ‌రీ

ఉరుకుల ప‌రుగుల జీవితంలో స‌మ‌యం లేక‌పోవ‌డంతో కిరాణా స‌రుకులు కొన‌డం సైతం ఆన్‌లైన్ అయిపోయింది. ఇందులో పెద్ద వింతేమీ లేదు. అయితే కొత్తగా బెంగుళూరులో పెట్రోలు సైతం హోం డెలివ‌రీ అందించేందుకు రంగం సిద్ద‌మ

ఉరుకుల ప‌రుగుల జీవితంలో స‌మ‌యం లేక‌పోవ‌డంతో కిరాణా స‌రుకులు కొన‌డం సైతం ఆన్‌లైన్ అయిపోయింది. ఇందులో పెద్ద వింతేమీ లేదు. అయితే కొత్తగా బెంగుళూరులో పెట్రోలు సైతం హోం డెలివ‌రీ అందించేందుకు రంగం సిద్ద‌మైంది. దాని గురించి మ‌రిన్ని వివ‌రాలు...

పెట్రోలు కొనుగోలు ఆన్‌లైన్‌లో

పెట్రోలు కొనుగోలు ఆన్‌లైన్‌లో

మీ కారులో హ‌ఠాత్తుగా పెట్రోలు అయిపోయిందా? అయితే ఇంత‌కుముందు చాలా ఆలోచించాల్సి వ‌చ్చేది ఏమి చేయాలా అని... ఇక‌పై ఆ చింత లేదు ఎందుకంటే డోర్-టు-డోర్ పెట్రోలు లేదా డీజిల్ అందించేందుకు ఒక కంపెనీ ఉంది. మైపెట్రోల్‌పంప్‌.కామ్ లేదా 7880504050 నంబ‌రులో సంప్ర‌దించి ఆన్‌లైన్‌లో పెట్రోలు బుక్ చేసుకోవచ్చు.

 పెట్రోలు,డీజిల్‌ క‌నీస ఆర్డ‌ర్‌

పెట్రోలు,డీజిల్‌ క‌నీస ఆర్డ‌ర్‌

పెట్రోలు లేదా డీజిల్ ర‌వాణా అంత సులువైన విష‌యం కాదు. త‌క్కువ మొత్తంలో ఇంధ‌నం స‌ర‌ఫ‌రా చేయ‌డం వల్ల కంపెనీకి సైతం పెద్ద‌గా ఏమీ రాదు. అందుకోస‌మే క‌నీస ఆర్డ‌ర్‌ను 20 లీట‌ర్ల నుంచి గ‌రిష్టంగా 100 లీట‌ర్ల‌కు ఉంచారు. 100 లీట‌ర్ల వ‌ర‌కూ డెలివ‌రీ చేసినందుకు 99 వ‌ర‌కూ రుసుము వ‌సూలు చేస్తారు. 100 లీట‌ర్ల ధ‌ర దాటితే క‌నీసం ఒక్కో లీట‌ర్‌కు ఒక్కో రూపాయి డెలివ‌రీ చార్జీగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

 ఏ ఏరియాల్లో

ఏ ఏరియాల్లో

ప్ర‌స్తుతం పెట్రోలు పంపుల నుంచి తీసుకొచ్చే ఈ పెట్రోలు లేదా డీజిల్‌ను హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కోర‌మంగ‌ళ‌, బెల్లందూర్‌, బీటీఎమ్ లేఅవుట్‌, బొమ్మ‌న‌హ‌ళ్లి ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 8 గంట‌ల వ‌రకూ ఈ స‌దుపాయం ఉంది. వ్య‌క్తిగ‌త వాహ‌న సొంత‌దారుల‌కు, పాఠ‌శాల‌ల‌కు, ఆసుప‌త్రుల‌కు, అపార్ట్‌మెంట్ల‌కు, డీజిల్ జ‌న‌రేట‌ర్లు నిర్వ‌హించే వాణిజ్య ఆప‌రేట‌ర్లకు మై పెట్రోల్ పంప్ ఇంటి వ‌ద్ద‌కే ఇంధ‌నాన్ని అందిస్తోంది.

 పెట్రోలియం డీల‌ర్ల స్పంద‌న

పెట్రోలియం డీల‌ర్ల స్పంద‌న

క‌న్సార్టియం ఆఫ్ ఇండియ‌న్ పెట్రోలియం డీల‌ర్ల ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ విధానం అమెరికాలో విఫ‌ల‌మైంద‌న్నారు. త‌మ వ్యాపారంపై ప్ర‌భావం ప‌డ‌ట‌మే కాకుండా భ‌ద్ర‌త విష‌యంలోనూ కొన్ని ఆందోళ‌న‌లు ఉన్నాయ‌ని పెట్రోలియం డీల‌ర్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+