మరో 30 స్మార్ట్ నగరాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఇది వరకే ప్రకటించిన స్మార్ట్ నగరాలకు తోడుగా కేంద్రం మరో 30 నగరాలను శుక్రవారం ప్రకటించింది. జూన్ 2015 నాటికి పట్టణాభివృద్ది శాఖ ప్రకటించిన స్మార్ట్ నగరాల సంఖ్య 90గా ఉన్నాయి. ఈ దశల
ఇది వరకే ప్రకటించిన స్మార్ట్ నగరాలకు తోడుగా కేంద్రం మరో 30 నగరాలను శుక్రవారం ప్రకటించింది. జూన్ 2015 నాటికి పట్టణాభివృద్ది శాఖ ప్రకటించిన స్మార్ట్ నగరాల సంఖ్య 90గా ఉన్నాయి. ఈ దశలో 45 నగరాలు పోటీపడగా 40 నగరాలు జాబితా సమర్పించాయి. వారు సమర్పించిన ప్రణాళికలు, ఆచరణ సాధ్యమ్యే అంశాల గురించి విశ్లేషించిన తర్వాత అందులో నుంచి 30 నగరాలను ఎంపిక చేశారు.

శుక్రవారం ప్రకటించిన 30 నగరాల్లో 26 అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ ప్రణాళికలు, 26 నగరాలు పాఠశాలలు, ఆసుపత్రి ప్రాజెక్టులు, 29 నగరాలు రోడ్ల రీడిజైన్, పునర్నిర్మాణం వంటి వాటికి ప్రణాళికలు రచించాయి. ఎంపిక అయిన నగరాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్, బీహార్‌షరీఫ్(బీహార్), డయ్యూ(డామన్ అండ్ డయ్యూ), సిల్వస్సా(దాద్రా నగర్ హవేలి), కవరట్టి(లక్షద్వీప్), నవి ముంబయి, గ్రేటర్ ముంబయి, అమరావతి(మహారాష్ట్ర), ఇంఫాల్(మణిపూర్), షిల్లాంగ్(మేఘాలయ), దిండిగల్(తమిళనాడు), ఈరోడ్(తమిళనాడు), పశ్చిమ బెంగాల్‌లోని బిధన్‌నగర్, దుర్గాపూర్, హల్దియా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్, రాయ్ బరేలి, ఘజియాబాద్, షహ్రాన్‌పూర్, రాంపూర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications