For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల‌తో మొద‌లై న‌ష్టాల్లోకి

తొలుత లాభాలతో మొదలై రికార్డు స్థాయిల‌ను అందుకున్న‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు యూరప్‌ మార్కెట్ల ప్రభావంతో చివర్లో వెనకడుగు వేశాయి. ఒక ద‌శ‌లో 31,500 పాయింట్ల మైలురాయిని తాకిన సెన్సెక్స్‌ చివర్లో నష్టాల్లోక

|

* రికార్డు లాభాల్లోకి వెళ్లి త‌ర్తా న‌ష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
తొలుత లాభాలతో మొదలై రికార్డు స్థాయిల‌ను అందుకున్న‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు యూరప్‌ మార్కెట్ల ప్రభావంతో చివర్లో వెనకడుగు వేశాయి. ఒక ద‌శ‌లో 31,500 పాయింట్ల మైలురాయిని తాకిన సెన్సెక్స్‌ చివర్లో నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 7 పాయింట్ల స్వల్ప లాభంతో 31,291(0.02%) వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 4 పాయింట్ల నామమాత్ర నష్టంతో 9,630 వద్ద ముగిసింది. తొలుత ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 31,500 మార్క్‌ను అందుకుంది. నిఫ్టీ సైతం గత ఇంట్రాడే గరిష్టం 9,700కు చేరువైంది. అయితే మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి మిశ్రమంగా ముగిశాయి.

 న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్‌లో రంగాల వారీగా చూస్తే చ‌మురు,స‌హ‌జ వాయువు(1.75%), స్థిరాస్తి(1.62%), లోహ రంగం(1.41%), పీఎస్‌యూ(1.19%) లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు బ్యాంకింగ్ రంగం 0.22 శాతం ప‌డిపోయింది.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1.59%), హెచ్‌డీఎఫ్‌సీ(1.56%), రిల‌య‌న్స్‌(1.07%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.84%), మారుతి(0.75%) ముందుండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో ఓఎన్‌జీసీ(2.79%), హెచ్‌యూఎల్‌(2.62%), లుపిన్‌(2.44%), ప‌వ‌ర్ గ్రిడ్‌(2.31%), కోల్ ఇండియా(1.75%) ఉన్నాయి.

English summary

లాభాల‌తో మొద‌లై న‌ష్టాల్లోకి | Sensex ends flat after hitting record high

The Sensex ended flat after earlier rising as much as 0.8 per cent to a record high as IT firms reversed earlier gains after Nasscom issued a muted revenue guidance for exports, while energy firms fell on sliding oil prices. The benchmark BSE index closed up 7.1 points or 0.02 per cent at 31,290.74, after earlier hitting a record high of 31,522.87. The broader NSE index closed down 3.6 points or 0.04 per cent at 9,630.00.
Story first published: Thursday, June 22, 2017, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X