ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. త్వరలో దేశవ్యాప్తంగా అమలుకానున్న వస్తు, సేవలపన్ను (జీఎస్‌టీ) ప్రభావం బంగారంపై సానుకూలంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీస
ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. త్వరలో దేశవ్యాప్తంగా అమలుకానున్న వస్తు, సేవలపన్ను (జీఎస్‌టీ) ప్రభావం బంగారంపై సానుకూలంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) పేర్కొంది. కేవలం బంగారంపైనే కాకుండా ఆభరణాల తయారీదారులు, అమ్మకందారులు, ఇతర వ్యాపారాలపై కూడా కొత్త పన్ను ప్రభావం ఉండబోతోందని తెలిపింది. జులై 1వ తేదీ నుంచి జీఎస్‌టీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బంగారంపై 2% పన్ను ఉండగా జీఎస్‌టీ అమల్లోకి వస్తే అది 3శాతంగా ఉంటుంది.దీంతో స్వల్పంగా బంగారం ధరలు పెరగొచ్చని భావిస్తున్నారు.

బంగారం, వెండిపై 3% పన్ను
ఇదివరకే ఖరీదైన లోహాలు(బంగారం, వెండి) వంటి వాటిపై పన్ను రేటు చాలా తక్కువగా ఉండటంతో మొదట బంగారంపై నిర్ణయించిన రేట్లపై బంగారు,ఆభరణాల వ్యాపారులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో మొదట ఊహించిన 5% పన్ను రేటు నుంచి బంగారం,వెండిపై పన్ను రేట్లను 3 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ వ్యాపారులు బంగారంపై విధించే పన్నును 1 శాతం ఉంటే బాగుంటుందని కోరుతున్నారు.

జులై 1 నుంచి అమలు చేయనున్న జీఎస్టీ విషయంలో ప్రభుత్వం కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి బయట ఉంచింది. కొన్ని వస్తువులపై జీఎస్టీని సున్నా శాతంగా నిర్ణయించింది. జీఎస్టీ పన్ను అమలు తర్వాత ఏ వస్తువుపై ఎంత పన్ను ఉండాలనే దాని గురించి జీఎస్టీ మండలి ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 1200 వస్తువులపై 4 రకాల పన్ను రేట్లను నిర్ణయించారు.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications