ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఉబర్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఉబెర్ కంపెనీ సీఈవో ట్రావిస్ కాలనిక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ఉబర
ప్రముఖ క్యాబ్ సర్వీసు సంస్థ ఉబర్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు ట్రావిస్ కలనిక్ తన సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఉబెర్ కంపెనీ సీఈవో ట్రావిస్ కాలనిక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ఉబర్ పెట్టుబడిదార్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీగా గుర్తింపు పొందిన ఉబెర్‌లో... పురుషాధిపత్య సంస్కృతి కొనసాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి తోడు వారం క్రితమే ట్రావిస్ తల్లి బోటింగ్ చేస్తూ అకాల మరణం చెందారు.

దీంతో ఆయన నిరవధికంగా సెలవు పెట్టాలని భావించారు. అయితే కంపెనీలోని ప్రధాన వాటాదారులు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. 'మూవింగ్ ఉబెర్ ఫార్వార్డ్' పేరితో లేఖ రాస్తూ... ట్రావిస్ వెంటనే రాజీనామా చేయాలనీ, నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీలేక మెట్టుదిగిన ఆయన... పెట్టుబడి పెట్టిన వారి కోరిక మేరకు కంపెనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ట్రావిస్ ఇకపై సంస్థ బోర్డులో సభ్యుడిగా మాత్రం కొనసాగే అవకాశం ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications