స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

ఒక ప‌క్క చ‌మురు ధ‌ర‌ల ప‌త‌నంతో అంత‌ర్జాతీయ మార్కెట్లు ప్ర‌తికూలంగా సాగాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నడుమ ప్రతికూలంగా సాగిన‌ దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు రోజులో చివరివరకూ న‌ష్టాల్లోనే కదిలాయి. మార్కెట్లు

ఒక ప‌క్క చ‌మురు ధ‌ర‌ల ప‌త‌నంతో అంత‌ర్జాతీయ మార్కెట్లు ప్ర‌తికూలంగా సాగాయి. ప్రపంచ మార్కెట్ల బలహీనతల నడుమ ప్రతికూలంగా సాగిన‌ దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు రోజులో చివరివరకూ న‌ష్టాల్లోనే కదిలాయి. మార్కెట్లు ముగిసేసరికి స్వల్ప నష్టాలతో స‌రిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు క్షీణించి 31,284 వద్ద ముగిసింది. నిఫ్టీ మరింత ఎక్కువ‌గా 20 పాయింట్లు క్షీణించి(0.25%) న‌ష్ట‌పోయి 9,650 దిగువన 9,634 వద్ద స్థిరపడింది.

 సెన్సెక్స్ 14 పాయింట్లు డౌన్‌

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎమ్‌సీజీ(0.73%), స్థిరాస్తి(0.51%), విద్యుత్(0.19%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.06%) పైకి ఎగియ‌గా; మ‌రో వైపు లోహ‌రంగం(1.2%), చ‌మురు,స‌హ‌జ వాయు రంగం(0.86%), పీఎస్‌యూ(0.68%), ఆటో(0.66%) న‌ష్ట‌పోయాయి.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో కొట‌క్ బ్యాంక్‌(0.85%), స‌న్ ఫార్మా(0.8%), విప్రో(0.73%), మారుతి(0.71%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.7%) ముందుండ‌గా; టాటా మోటార్స్‌(2.11%), ఓఎన్‌జీసీ(2.1%), లుపిన్‌(1.63%), అదానీ పోర్ట్స్‌(1.58%), టీసీఎస్‌(1.45%) బాగా న‌ష్ట‌పోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+