జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్
జులై 1 నుంచి కేంద్రం అమల్లోకి తేనున్న జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్‌ను నియమించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం తర్వాత చేపట్టన
జులై 1 నుంచి కేంద్రం అమల్లోకి తేనున్న జీఎస్టీ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్‌ను నియమించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం తర్వాత చేపట్టనున్న అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణను ప్రజలందరికీ తెలియజేసేందుకు ఈ విధంగా చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దేశమంతా ఏకరీతి మార్కెట్ కిందకు తెచ్చేందుకు జీఎస్టీ సహకరించగలదని ఆ పోస్ట్‌కు సంబంధించిన సందేశంలో పేర్కొన్నారు.

జాతీయ జెండా మూడు రంగులకు అనుగుణంగా ఏకీకృత శక్తిగా జీఎస్టీ గురించి బచ్చన్ వివరించారు.'ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్' ను తయారుచేసే విధంగా జీఎస్టీ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అతిపెద్ద పన్ను వ్యవస్థను ఇంకొన్ని రోజుల్లో అమలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి బాలీవుడ్ స్టార్ ఈ ప్రమోషన్ ప్రక్రియలో పాలు పంచుకోనున్నారు. ఇది వరకే అమితాబ్ బచ్చన్ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications