255 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
సెన్సెక్స్ 31,300 పాయింట్లు, నిఫ్టీ 9,650 పాయింట్ల ఎగువున ముగిశాయి. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో ముగిశాయి. దేశంలో 12 మొండి బకాయిలకు సంబంధించిన వసూళ్లకోసం చర్యలకు ఆర్‌బీ
సెన్సెక్స్ 31,300 పాయింట్లు, నిఫ్టీ 9,650 పాయింట్ల ఎగువున ముగిశాయి. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో ముగిశాయి. దేశంలో 12 మొండి బకాయిలకు సంబంధించిన వసూళ్లకోసం చర్యలకు ఆర్‌బీఐ సమాయత్తమైన నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించాయి. జీఎస్టీ విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండటంతో పాటు, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, భాజపా రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్ నాథ్ గోవింద్‌ను ప్రకటించడం మార్కెట్లు రాణించేందుకు కారణమయ్యాయి. ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు చివరి వరకూ సానుకూలంగానే సాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 31,311.57 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 69.5 పాయింట్లు పైకి ఎగసి 9657 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే లోహ రంగం(1.89%), బ్యాంకింగ్(0.96%), మూలధన వస్తువులు(0.74%), ఎఫ్ఎమ్‌సీజీ(0.72%) లాభపడగా; హెల్త్‌కేర్ (0.48%), స్థిరాస్తి(0.32%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.22%),ఐటీ(0.09%) నష్టపోయాయి.
సెన్సెక్స్ సూచీలో లాభపడిన వాటిలో అదానీ పోర్ట్స్(3.05%), యాక్సిస్ బ్యాంకు(1.94%), పవర్ గ్రిడ్(1.67%), ఎల్ అండ్ టీ(1.59%), రిలయన్స్(1.53%) లాభపడిన వాటిలో ముందుండగా, ఇన్ఫోసిస్(1.17%), సన్ ఫార్మా(0.77%), డాక్టర్ రెడ్డీస్(0.76%), టాటా మోటార్స్(0.7%), కోల్ ఇండియా(0.59%) నష్టపోయాయి.


Click it and Unblock the Notifications