చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయని తెలిసినప్పటికీ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర
చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయని తెలిసినప్పటికీ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. దీని అమలును ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జూన్ 30వ తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి న్యూ ఢిల్లీలో కొత్త పరోక్ష పన్ను విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ భవనంలో మోదీ నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ మండలితో సమావేశమైన జైట్లీ కొన్ని నిర్ణయాలను ప్రకటించారు. ఏసీ హోటళ్ల విషయంలో కాస్త కరుణ చూపారు. ఇంతకుముందు రూ.5000 పైన 28% గా ఉన్న పన్నును ప్రస్తుతం రూ.7500కు పెంచారు. అంటే రూ.7500 పైబడి ఉన్న బిల్లుల విషయంలో 28% పన్ను, రూ.2500 నుంచి రూ.7500 మధ్య ఉన్న బిల్లులకు సంబంధించి 18% పన్ను ఉంటుంది.

న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 17వ జీఎస్టీ మండలి సమావేశం ముగిసిన అనంతరం అరుణ్ జైట్లీ విలేకర్లతో మాట్లాడారు. వ్యాపారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తొలి రెండు నెలలపాటు పన్ను రిటర్నులు దాఖలు విషయంలో వ్యాపారులకు కొంతమేర వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు వరకు ఈ వెసులుబాట్లు అమల్లో ఉంటాయని, సెప్టెంబర్ నెల నుంచి కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. అన్ని వస్తువులు, సేవలపై పన్నులు ఖరారు చేశామని, నియమ నిబంధనలపై తుది నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. జూన్ 30న జీఎస్టీ మండలి మరోసారి సమావేశమవుతందని, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ రోజు తొలగిపోతాయని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications