English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఆ ప్రాంతంలో స్థిరాస్తి డిమాండ్‌లో హైద‌రాబాద్‌యే టాప్‌

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ఆసియా పసిఫిక్‌లో రియ‌ల్ ఎస్టేట్‌కు డిమాండ్ ఉన్న న‌గ‌రాలు

స్థిరాస్తి రంగంలో రిటైల్, కార్యాల‌యం డిమాండ్ ఏదైనా ద‌క్షిణాది న‌గ‌రాలు త‌మ స‌త్తా చాటుతుంటాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌తో మొద‌లుకొని, 6 భార‌తీయ న‌గ‌రాలు ఆసియా పపిఫిక్ ప్రాంతంలో టాప్ 10 ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌దేశాలుగా ఉన్నాయి. వాణిజ్య స్థ‌లాల‌కు క్ర‌మంగా డిమాండ్ పెరుగుతుండ‌టంతో ఈ విధంగా స‌మీక‌ర‌ణాలు మారుతున్న‌ట్లు ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం స్థిరాస్తి రంగంలో డిమాండ్ ఉన్న న‌గ‌రాలేవో తెలుసుకుందాం.

హైద‌రాబాద్‌

హైద‌రాబాద్‌

ద‌క్షిణాదిలో ఐటీ రంగంలో వెలుగొందుతున్న న‌గ‌రం హైద‌రాబాద్‌. ఈ ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో ప్ర‌స్తుతం స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల‌కు నంబ‌ర్ వ‌న్ గ‌మ్య‌స్థానంగా ఉంది. ఈ న‌గ‌రంలో ఆపిల్‌, అమెజాన్‌, గూగుల్‌, ఉబ‌ర్ వంటివి త‌మ రెండో అతిపెద్ద డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ కంపెనీల‌న్నీ కేవ‌లం 10 కి.మీ వ్యాసార్థం లోపే ఉన్నాయి. అంతే కాకుండా హైద‌రాబాద్‌లో ఇంకా ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, క్వాల్‌కామ్ వంటి బ‌హుళ జాతి కంపెనీలు సైతం ఉన్నాయి.

బెంగ‌ళూరు

బెంగ‌ళూరు

దేశ సిలికాన్ న‌గ‌రంగా ప్ర‌సిద్ది చెందిన బెంగ‌ళూరు స్థిరాస్తి విష‌యంలో 6వ స్థానంలో ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐటీ రంగంలో త‌న‌కంటూ ఒక పేరును సంపాదించుకుంది ఈ ఉద్యాన న‌గ‌రం. దేశంలో ఉన్న ఐటీ సంస్థ‌ల్లో దాదాపు 35% ఈ న‌గ‌రంలో ఉన్నాయి. చాలా కంపెనీలు త‌మ సంస్థ‌కు సంబంధించి ఒక కార్యాల‌య‌న్నైనా బెంగుళూరులో నెల‌కొల్పాయి. గూగుల్‌, యాక్సెంచ‌ర్‌, ఓరాకిల్‌, ఐబీఎమ్‌, హెచ్‌పీ, జీఈ, డెలాయిట్‌, క్యాప్‌జెమినీ, హెచ్‌సీఎల్‌, డెల్‌, సిస్కో, మైండ్ ట్రీ, అమెజాన్ వంటి వాటితో పాటు ఎన్నో బీపీవోల‌ను క‌లిగి బీపీవో హ‌బ్ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతోంది.

ముంబ‌యి

ముంబ‌యి

దేశంలో అత్యంత జ‌న‌స‌మ్మ‌ర్థ‌మైన న‌గ‌రం ముంబ‌యి. ఇది దేశ ఆర్థిక రాజ‌ధానిగా పిల‌వ‌బ‌డుతుంది. దేశంలో ఎక్కువ వ్యాపారం జ‌రిగే న‌గ‌రాల్లో ఇది ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంది. ఈ న‌గ‌రం స్థిరాస్తి విష‌యంలో ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో 7 వ స్థానంలో కొన‌సాగుతున్న‌ది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యం, ఇక్క‌డ ఉండే పోర్ట్ ద్వారా విదేశీ వ్యాపారానికి సంబంధించి ఎక్కువ స‌రుకును ర‌వాణా చేసే హ‌బ్‌గా కొన‌సాగుతోంది. దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీ, ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద‌దిగా ఉన్న బీఎస్ఈ సెన్సెక్స్ ఇక్క‌డ నుంచే నిర్వ‌హించ‌బ‌డుతోంది.

 పుణె

పుణె

మ‌హారాష్ట్ర సాంస్కృతిక రాజ‌ధానిగా ఉన్న పుణె మొత్తం 10 న‌గ‌రాల్లో 8వ స్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఉన్న నివేదికల ఆధారంగా పుణె న‌గ‌రంలో నివాస గృహాల‌కు సంబంధించిన స్థిరాస్తి వ్యాపారం డిమాండ్ పెరుగుతూ ఉంది. మంచి విద్యా వ‌స‌తి, ఐటీ రంగ పురోగ‌తి, ఉద్యోగ అవ‌కాశాలు, జీవ‌న శైలి, మౌలిక వ‌స‌తులు వంటివ‌న్నీ ఈ డిమాండ్‌కు కార‌ణంగా నిలుస్తున్నాయి.

చెన్నై

చెన్నై

త‌మిళ‌నాడు రాజ‌ధాని న‌గ‌రం కావ‌డం చెన్నైకు ఉన్న ప్ర‌థ‌మ ఆకర్ష‌ణ‌. ఈ న‌గ‌రం 9వ స్థానంలో ఉంది. ఉత్త‌మ కార్పొరేట్ సంస్థ‌ల కార్యాలయాలు, టీసీఎస్ ప్ర‌ధాన కేంద్రం వంటి వాటికి చెన్నై న‌గ‌రం నిల‌యంగా ఉంది. ఆటోమొబైల్ తో పాటు ప‌లు రంగాల పరిశ్ర‌మ‌ల‌ను ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో నెల‌కొల్పుతూ వ‌స్తున్నారు.

 న్యూ ఢిల్లీ

న్యూ ఢిల్లీ

దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీ దేశంలో 10వ స్థానంలో ఉంది. దేశ చ‌రిత్ర‌లో దీనికి ప్ర‌ముఖ స్థానం ఉంది. ఎన్నో రాజ్యాలు దీన్ని రాజ‌ధానిగా చేసుకుని ప‌రిపాలించాయి. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయ‌ప‌రంగా రాజ‌ధాని న‌గ‌రంగా కొన‌సాగుతున్న‌ది. ఒకప్పుడు ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల‌తో మొద‌లై ప్రస్తుతం వ్యాపార ప‌రంగా చూసినా బాగా వృద్ది చెందుతోంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఢిల్లీలో త‌మ కార్య‌కలాపాల‌ను త‌ప్ప‌నిస‌రిగా విస్త‌రిస్తున్నాయి. జ‌నాభా ఎక్కువ ఉండ‌టంతో ఇక్క‌డ నివాసాల‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే వ‌స్తున్న‌ది.

 భార‌త‌దేశ న‌గ‌రాలు

భార‌త‌దేశ న‌గ‌రాలు

ఈ ఏడాదికి అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల ప‌రంగా చూస్తే వాణిజ్య కార్యాల‌యాల స్థలాల విష‌యంలో బెంగుళూరులో ఎక్కువ‌గా ఆస‌క్తి ఉంది. త‌ర్వాత చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైద‌రాబాద్‌, ముంబ‌యి, పుణె వంటివి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇది కేవ‌లం ఆసియా ప‌సిఫిక్ ప్రాంతానికి చెందిన‌ద‌ని గుర్తుంచుకోవాలి.

 వృద్ది ప‌థంలో దేశం

వృద్ది ప‌థంలో దేశం

2005-08 మ‌ధ్య కాలం నుంచి స్థిరాస్తి రంగంలో వ‌చ్చిన మార్పుల మూలంగా విలువైన పాఠాలు నేర్చుకున్నారు. దాని ఫ‌లితంగా భార‌త స్థిరాస్తి రంగంలో ఉన్న అవకాశాల‌ను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ పెట్టుబ‌డిదారులు సిద్దంగా ఉన్న‌ట్లు కుష్‌మ‌న్ అండ్ వేక్‌ఫీల్డ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సిద్ధార్త్ గోయెల్ చెప్పారు. ప్ర‌స్తుతం పెరుగుతున్న జీడీపీ, వ్యాపార అనుకూల వాతావ‌ర‌ణం, పెట్టుబ‌డిదారుకు ప్రోత్సాహ‌క‌ర‌మైన విధానాలు వంటి వాటి మూలంగా దేశంలో ఆర్థిక వృద్ది వేగంగా జ‌రిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

 బ్యాంకాక్‌, మ‌నీలా

బ్యాంకాక్‌, మ‌నీలా

మొత్తం ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో స్థిరాస్తి ప‌రంగా హైద‌రాబాద్ ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా బ్యాంకాక్. మ‌నీలా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనా న‌గ‌రాలు గ్వాంగ్జో, షెంజెన్ 4,5 స్థానాల‌ను ఆక్ర‌మించాయి. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక‌సేవ‌లు; హెల్త్‌కేర్‌, క‌న్స‌ల్టింగ్ సేవ‌లు వంటివి, త‌యారీకి చెందిన‌ ప‌రిశ్ర‌మ‌లు వంటి రంగాల్లోని కంపెనీలు వాణిజ్య స్థలాల‌కు డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయ‌ని గోయెల్ విశ్లేషించారు.

ఆసియా ప‌సిఫిక్‌లో డిమాండ్ ప‌రంగా న‌గరాలు- వాటి స్థానాలివే...

ఆసియా ప‌సిఫిక్‌లో డిమాండ్ ప‌రంగా న‌గరాలు- వాటి స్థానాలివే...

1 హైద‌రాబాద్‌

2 బ్యాంకాక్‌

3 మ‌నీలా

4 గ్వాంగ్జో

5 షెంజెన్

6 బెంగ‌ళూరు

7 ముంబ‌యి

8 పుణె

9 చెన్నై

10 న్యూఢిల్లీ

Read more about: real estate, hyderabad
English summary

6 Indian cities in top 10 emerging investment destinations in APAC

Indian cities were among the top 10 markets targeted by investors. Most of the global investments for this year will be made in commercial office assets as markets in Bengaluru, Chennai, Delhi NCR, Hyderabad, Mumbai and Pune are well placed to outperform other cities from emerging economies in Asia Pacific
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC