80 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ఉదయం నుంచి అస్థిరంగా కొనసాగిన మార్కెట్లు చివరికీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంతో 31,075 వద్ ముగియగా,
మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ఉదయం నుంచి అస్థిరంగా కొనసాగిన మార్కెట్లు చివరికీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంతో 31,075 వద్ద ముగియగా, నిఫ్టీ 40.10 పాయింట్లను కోల్పోయి 9,578 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం(2.16%), హెల్త్‌కేర్(0.86%), విద్యుత్(0.05%) లాభపడగా; చమురు,సహజవాయు(1.15%), ఐటీ(0.92%), టెక్నాలజీ(0.92%), క్యాపిటల్ గూడ్స్(0.68%), బ్యాంకింగ్(0.41%) నష్టపోయాయి.

సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో రిలయన్స్(2.11%), సిప్లా(1.74%), విప్రో(1.54%), డా రెడ్డీస్(1.27%), సన్‌ఫార్మా(1.08%) ఉండగా; నష్టపోయిన వాటిలో టీసీఎస్(2.42%), ఎల్ అండ్‌టీ(1.4%), ఓఎన్జీసీ(1.18%), ఎం అండ్ ఎం(1.16%), కోల్ ఇండియా(1.13%) ,గెయిల్(1.10%) ముందు ఉన్నాయి.


Click it and Unblock the Notifications