166 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు ఒక మోస్తరుగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల వరకూ నష్టపోగా నిఫ్టీ సైతం నష్టాలకు గురైంది. ఒక పక్క మార్కెట్ క్లోజింగ్ తర్వాత వచ్చే ఐఐపీ, ద్రవ్యోల్బణ
సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు ఒక మోస్తరుగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల వరకూ నష్టపోగా నిఫ్టీ సైతం నష్టాలకు గురైంది. ఒక పక్క మార్కెట్ క్లోజింగ్ తర్వాత వచ్చే ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మరియు ఈ వారం వచ్చే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం గురించి ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

30 షేర్ల బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 31,096 వద్ద స్థిరపడగా; నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 9616 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్(1.58%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.32%), బ్యాంకింగ్(1.02%), ఆటో(0.73%) లాభపడ్డ వాటిలో ఉండగా, మరో వైపు ఐటీ(0.42%), హెల్త్‌కేర్(0.26%), టెక్నాలజీ(0.18%) నష్టాలకు గురైన రంగాల్లో ఉన్నాయి.
టాప్ గెయినర్లలో ఇన్ఫోసిస్(1.6%), సన్ ఫార్మా (1.59%), హెచ్‌యూఎల్ (0.42%), సిప్లా ( 0.41%), గెయిల్ (0.24%) ఉండగా, ప్రధానంగా నష్టాలకు గురైన వాటిలో ఎల్ అండ్ టి (-2.29) టాటా మోటార్స్ (-2.29%), విప్రో (-1.95%), ఐసిఐసిఐ బ్యాంక్ (-1.88%), బజాజ్ ఆటో (-1.37%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications