25 వేల హాట్‌స్పాట్లను ఇన్‌స్టాల్ చేయనున్న బీఎస్ఎన్ఎల్
వచ్చే 12 నెలల్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మార్కెట్ వాటాగా 11 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్(యూనివర్సల్ స
వచ్చే 12 నెలల్లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మార్కెట్ వాటాగా 11 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు టెలికాం మంత్రి మనోజ్ సిన్హా శుక్రవారం వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్(యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) మధ్య ఒప్పందం సందర్భంగా మాట్లాడుతూ "ఈసారి మార్కెట్ వాటాలో 0.3% వృద్దిని ఆశిస్తున్నాం. మళ్లీ సారి కలిసినప్పుడు వృద్ది రేటు 10% కన్నా తక్కువ ఉండకూడదు. అయితే నేను అది 10.5% ఉండగలదు అనుకుంటున్నా, ఒకవేళ అది 11% దాటితే బీఎస్ఎన్ఎల్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా ఏడాది కాలంలో 9.05% నుంచి 9.35%కు పెరిగింది. శాతాల వారీగా చూస్తే వృద్ది 3.3% పెరిగినట్లుంది. బీఎస్ఎన్ఎల్, యూఎస్‌వోఎఫ్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంపుకు బాటలు పడతాయి. దీని ప్రకారం వచ్చే 4 నెలల్లో 942 కోట్ల రూపాయలతో 25 వేల రూరల్ ఎక్స్చేంజీలకు సంబంధించి 25 వేల హాట్‌స్పాట్‌ల ఏర్పాటు జరుగుతుందని సిన్హా చెప్పారు. ఇప్పటికే చాలా వాటాల మార్పు జరిగిందని, జూన్ 30 నాటికల్లా భారత్‌నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల పెంపును పూర్తిచేయాలని బీఎస్ఎన్ఎల్ అధికారులకు సూచించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications