స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వద్ద ముగియగా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగసి 9668 వద్ద స్థిరపడింది.
వారాంతంలో దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వద్ద ముగియగా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగసి 9668 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(0.9%), ఎఫ్ఎంసీజీ(0.84%), టెక్నాలజీ(0.71%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.54%) నష్టపోగా; మరో వైపు స్థిరాస్తి అన్నిటికంటే ఎక్కువగా 2.73% లాభపడింది. లోహ(1.17%), ఆటో(0.8%), బ్యాంకింగ్(0.44%) లాభపడ్డాయి.

సెన్సెక్స్ టాప్ గెయినర్లలో మారుతి(2.56%), టాటా మోటార్స్(1.4%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(1.19%), టాటా స్టీల్(0.91%), ఏసియన్ పెయింట్స్(0.65%) ఉండగా; గెయిల్(2.17%), ఐటీసీ(1.8%), విప్రో(1.7%), ఇన్ఫోసిస్(1.18%), టీసీఎస్(0.95%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Click it and Unblock the Notifications