తేజాస్ నెట్‌వర్క్స్ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే ఈ సంస్థ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. షేరు ముఖ విలువ
తేజాస్ నెట్‌వర్క్స్ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే ఈ సంస్థ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. షేరు ముఖ విలువ రూ. 10 ఉండగా; ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250-257 మధ్య ఖరారు చేశారు. ఇందులో రూ.450 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా 1,27,11,605 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. కనీసం 55 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నోమురా ఫైనాన్షియల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో షేర్లు లిస్ట్ అవుతాయి. 60 దేశాల్లోని టెలికం, ఇంటర్నెట్ సేవలు, యుటిలిటీలు, రక్షణ రంగంలోని కంపెనీలకు ఈ సంస్థ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ మార్చి 2017తో ముగిసిన త్రైమాసికానికి రూ.53.2 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఈ లాభం రూ. 27.4 కోట్లుగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications