ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం ఆర్‌బిఐ ఈ సారి రెపోరేట్లను యథతాధంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ దఫా సమీక్షా సమావేశంలో ఆర్‌బిఐ కొన్ని కీలకాంశాలపై అభిప్రాయాలను వెలువరించింది. జిఎస్‌టీ అమలుతో ద
ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం ఆర్‌బిఐ ఈ సారి రెపోరేట్లను యథతాధంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ దఫా సమీక్షా సమావేశంలో ఆర్‌బిఐ కొన్ని కీలకాంశాలపై అభిప్రాయాలను వెలువరించింది. జిఎస్‌టీ అమలుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన‍్న భయాలను ఆర్‌బిఐ తోసిపుచ్చింది. ద్రవ్యోల్బణంపై జిఎస్‌టీ ఎలాంటి ప్రభావం చూపదని అభిప్రాయపడింది.

ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2- 3.5 శాతం, మలి సగం 3.5- 4.5 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. ప్రధాన వస్తు సేవలన్నింటినీ నాలుగురకాల పన్ను శ్లాబుల్లో వర్గీకరిస్తూ ప్రభుత్వం వస్తు,సేవల పన్నును అమల్లోకి తీసుకురానుంది.
ఈ ఆర్థిక సంవత్సరం జివిఎ వృద్ధిపై గత ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనాలను ఆర్‌బిఐ 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 7.3 శాతంగా ప్రకటించింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలు వృద్ధి బాటలో అవరోధం కావచ్చని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. ఉత్పాదకాల ధరలు పెరగడం, వేతన వ్యయాల నిర్వహణ వంటివి కంపెనీల లాభాలపై వ్యతిరేక ప్రభావం చూపవచ్చని తద్వారా జివిఎ వృద్ధి కుంటుబడవచ్చని విశ్లేషించింది. భారీ రుణభారం ఉన్న కంపెనీలు- నిరర్ధక ఆస్తుల ఒత్తిడితో సతమతమవుతున్న బ్యాంకులు కలిసి ప్రైవేట్ పెట్టుబడులు డిమాండ్ పెరగకుండా చేస్తాయని పేర్కొంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications