ఆవుల అమ్మకంలో ఏం జరుగుతోంది?
మే 31 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆవు జీవితంపై శ్రధ్ద పెట్టింది. కబేళాలకు ఆవులను తరలించడాన్ని, ఆవులను చట్టవిరుద్దంగా విక్రయించడాన్ని కట్టడి చేస్తూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప
మే 31 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆవు జీవితంపై శ్రధ్ద పెట్టింది. కబేళాలకు ఆవులను తరలించడాన్ని, ఆవులను చట్టవిరుద్దంగా విక్రయించడాన్ని కట్టడి చేస్తూ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గిట్టని వర్గాల నుంచి దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. భారతదేశంలో ఆవులకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో ఇది చరిత్రాత్మకమైనది. కొంత మంది ఆహారపు హక్కును ఎలా హరిస్తున్నారంటూ నినదిస్తే, కొంత మంది ప్రభుత్వానికి మద్దతు పలికారు. అయితే మధ్యలో ఇదంతా ఎందుకో అనుకున్నారో ఏమో? సరికొత్తగా ఆలోచించారు కొంత మంది వ్యక్తులు. దీంతో మొదలైంది ఈ కొత్త విధానం. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మాంసం దుకాణాలు
సాధారణంగా మాంసం దుకాణాలు ఉన్నవాళ్లలో కొంత మంది రహస్యంగా ఆవు మాంసాన్ని విక్రయించడం జరిగింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కేవలం ఈ వ్యాపారంపై ఆధారపడ్డ వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఏదైనా ఇన్ని రోజులు చేసే పనిపై ఆర్థికంగా తెర పడితే కొత్త మార్గాన్ని వెతకడం వారి వంతైంది. దీంతో ఆన్‌లైన్ అవుల అమ్మకాలకు తెరతీశారు.

ఆన్‌లైన్‌లో ఆవు అమ్మకాలు
కొన్ని ప్రధాన పత్రికల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆవుల అమ్మకం ఆన్‌లైన్ బాట పట్టింది. ఇందుకోసం కొన్ని రహస్య వెబ్‌సైట్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరూ మాత్రమే వారికి తెలిసి మాత్రమే ఆ తంతును సాగించే ఏర్పాటు ఉంటుంది. కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఆవుల క్రయవిక్రయాలు అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతున్నది.

సాధారణ రీతిలో చేస్తే అంతే
ఆ మధ్య గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఆవు మాంసం విక్రయిస్తున్నారని చెప్పి చట్టాన్ని మరి చేతుల్లోకి తీసుకుని కొంత మంది వ్యక్తులను మరో వర్గం వారు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాంసం విక్రయించే చోట ఎట్టి పరిస్థితుల్లో ఆవులను ఉంచినా అది ప్రమాదకరమని వారణాసి సమీపంలోని ఘజిపూర్‌లో వ్యాపారులు వాపోతున్నారు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.

అసలేంటీ వివాదం
హిందువులకు ఆవు పవిత్రమైనదని అందరికీ తెలిసిన విషయమే. వేద కాలం నుంచి ఆవును పూజించడం వారి విశ్వాసం. అయితే రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆహారపు అలవాట్లలో భాగంగా ఆవును తింటే తప్పేంటనేది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారి వాదన. దీనికి సంబంధించి మేక్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కొన్ని భావనలకు స్వల్ప వివాదం రేగింది. స్నాప్‌డీల్ విషయంలో ఆ మధ్య ఎదురైన అనుభవమే ఈ దశలో మేక్‌మైట్రిప్‌కు ఎదురైంది.


Click it and Unblock the Notifications