త‌మ రంగానికి జీఎస్టీని 12శాతానికి త‌గ్గించాల‌ని టెల్కోల విన‌తి

జీఎస్టీలో వివిధ వ‌స్తువుల‌కు, సేవ‌ల‌కు ప‌న్ను రేట్లు ఖ‌రాయ్యాయి. దీంతో కొన్ని రంగాల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆ కోవ‌లో ఉన్న‌వాటిలో టెలికాం రంగం ఒక‌టి. ఇప్ప‌టికే అప్పుల భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న టెలికాం కంప

జీఎస్టీలో వివిధ వ‌స్తువుల‌కు, సేవ‌ల‌కు ప‌న్ను రేట్లు ఖ‌రాయ్యాయి. దీంతో కొన్ని రంగాల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆ కోవ‌లో ఉన్న‌వాటిలో టెలికాం రంగం ఒక‌టి. ఇప్ప‌టికే అప్పుల భారంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న టెలికాం కంపెనీలు జీఎస్టీ అమ‌లు త‌ర్వాత మ‌రింత ప‌న్ను భారాన్ని వ‌హించాల్సి వ‌స్తుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం దాదాపు 18 శాతం ప‌న్నును టెలికాం సేవ‌ల‌పై విధించే అవ‌కాశం ఉంది. జియో రాక‌తో దాదాపు అగ్ర‌స్థాయి టెలికాం కంపెనీల‌న్నీ లాభాల త‌గ్గుద‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. ఇక జులై 1 నుంచి జీఎస్టీ మొద‌లైదే మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

టెల్కోలంద‌రూ జీఎస్టీ భారాన్ని వినియోగ‌దారుల‌కే బ‌ద‌లాయిస్తారా!

ఇవ‌న్నీ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని ముందే మేల్కోన్న టెలికాం రంగం త‌మ‌ను త‌క్కువ ప‌రిధిలో ఉంచాల‌ని జీఎస్టీ స‌న్నాహ‌క స‌మావేశాల్లోనే వివ‌రించారు. ఇవ‌న్నీ ఏమీ లెక్క‌చేయ‌కుండా టెలికాం రంగానికి 18% ప‌న్ను విధించాలని ఆర్థిక శాఖ జీఎస్టీ మండ‌లికి సూచించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక స్వ‌ల్ప ఊర‌టేంటే మొబైల్ హ్యాండ్ సెట్ల‌పై మాత్రం కేవ‌లం 12% జీఎస్టీ ఉంటుంది. సెల్యూలార్ ఆప‌రేట‌ర్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) మొద‌టి నుంచి టెల్కోల హ‌క్కుల కోసం పోరాడుతోంది. జీఎస్టీ ప‌న్ను రేట్లు ఖ‌రారయిన క్ర‌మంలో సీవోఏఐ అప్ర‌మ‌త్త‌మైంది. త్వ‌ర‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, టెలికాం మంత్రి మ‌నోజ్ సిన్హా, రెవెన్యూ సెక్ర‌ట‌రీ హ‌స్ముఖ్ అధియాను క‌లిసి ఈ స‌మ‌స్య‌ను వారి దృష్టికి తీసుకెళుతామ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌సారి జీఎస్టీ 18% ప‌న్ను విధించ‌డం మొద‌లైతే టెలికాం సేవ‌లు ఖ‌రీద‌వుతాయని, ప‌రోక్షంగా ప‌రిశ్ర‌మ లాభాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని టాప్‌-3 టెలికాం సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌మ బాధ‌ను వెల్ల‌డిస్తున్నారు. జులై ప్రారంభానిక‌ల్లా దీనిపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+