మొదట డబ్బు లేకుండా టిక్కెట్... చెల్లింపు తర్వాతే...
ఐఆర్‌సీటీసీ సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన ప్రయాణికుడు తన ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని, ఆ టికెట్ తీసుకున్న 14 రోజులలోపు డబ్
రైలు ప్రయాణం అంత సుఖం మధ్య తరగతి వారికి మరొకటి ఉండదు. అందుకు రైల్వే సైతం ఎప్పటికప్పుడు తన పంథాను మార్చుకోవడమే కారణం. ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన సంస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ఇంత పెద్ద వ్యవస్థ టిక్కెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ స్థాపించారు. దాదాపు గంటకు కొన్ని వేలు, రోజుకు 10 లక్షల టిక్కెట్లను సమర్థవంతంగా బుక్ చేయవచ్చు. అయినప్పటికీ అందరూ ఆన్‌లైన్ బాట పట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైలు ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన ప్రయాణికుడు తన ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని, ఆ టికెట్ తీసుకున్న 14 రోజులలోపు డబ్బులు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పద్ధతిని అన్ని రైళ్లకూ వర్తింపచేయనున్నట్టు ఐఆర్సీటీసీ అధికార ప్రతినిధి సందీప్ దత్తా తెలిపారు. అయితే ఇలా ముందుగా టికెట్ తీసుకుని తరువాత చెల్లించే ప్రయాణికుల నుంచి 3.5 శాతం సర్వీసు చార్జ్ వసూలు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ విధానం ప్రయాణికులకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకయినా ఇలా టిక్కెట్లు అప్పు తీసుకుని జర్నీ చేయొచ్చు.

ఈ విధానంలో టిక్కెట్ల బుకింగ్ ఇలా:
* 'epay later' ద్వారా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి
* టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
* క్రెడిట్ కార్డు ఉన్న హోల్డర్స్ కు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.
* అంటే 14 రోజుల తర్వాత ఆటోమేటిగ్గా క్రెడిట్ కార్డు నుంచి ఛార్జీల మొత్తం కట్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications