For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ స‌రికొత్త గ‌రిష్టం 31,273

ప్రపంచ మార్కెట్లు లాభపడటంతో పటిష్టంగా మొదలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసేసరికి సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 31,273 వద్ద న

|

ప్రపంచ మార్కెట్లు లాభపడటంతో పటిష్టంగా మొదలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసేసరికి సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 31,273 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 9,653 వద్ద స్థిరపడింది. ఇవి గరిష్ట ముగింపు స్థాయిలుకాగా.. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్‌ 31,332కు చేరగా.. నిఫ్టీ 9,673ను తాకింది. కాగా.. మార్కెట్లు ప్రారంభంలోనే కొత్త గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు లాభాల డబుల్‌ సెంచరీకి చేరి గత రికార్డు 31,255ను అధిగమించగా.. నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకొని 9,650ను దాటేసింది.

 లాభాల్లో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి రంగం(1.22%), హెల్త్ కేర్‌(1.12%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(1.1%), ప‌వ‌ర్‌(0.73%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు చ‌మురు,స‌హ‌జ వాయు(0.41%), లోహ‌(0.23%), క్యాపిట‌ల్ గూడ్స్‌(0.05%) రంగాలు న‌ష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్‌లోని ముఖ్య కంపెనీల ప‌నితీరు ఈ విధంగా ఉంది. సూచీలో అత్యధికంగా హీరో మోటోకార్ప్ (+ 2.82%), సిప్లా (+ 2.63%), అదానీ పోర్ట్స్ (+ 2.13%), విప్రో (+ 1.88%), హెచ్‌డీఎఫ్‌సీ (+ 1.74%) లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా; టాటా స్టీల్ (-1.27%), పవర్ గ్రిడ్ (-0.77%), ఐసీఐసీఐ బ్యాంకు (-0.62%),హెచ్‌యూఎల్ (-0.5%) న‌ష్టాల‌కు గురైన వాటిలో ఉన్నాయి.

English summary

సెన్సెక్స్ స‌రికొత్త గ‌రిష్టం 31,273 | Indian benchmark indices hit fresh life-time high on positive global cues

The Sensex and Nifty ended at a new high on Friday as global stocks hit a record high since upbeat data on US manufacturing and employment and buoyant European factory growth boosted investor optimism.The 30-share BSE index Sensex jumped 135.70 points or 0.44 per cent to end at a new peak 31,273.29 and the 50-share NSE index Nifty rose 37.4 points or 0.39 per cent to close at a fresh high of 9,653.50.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X