భాగ్యనగరంలో ఐకియా స్టోర్ ప్రారంభం తర్వాత ఐకియా ఇతర నగరాల్లో విస్తరించేందుకు సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతంహైదరాబాద్, ముంబై తర్వాత బెంగళూరులో మూడో స్టోర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్
భాగ్యనగరంలో ఐకియా స్టోర్ ప్రారంభం తర్వాత ఐకియా ఇతర నగరాల్లో విస్తరించేందుకు సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం
హైదరాబాద్, ముంబై తర్వాత బెంగళూరులో మూడో స్టోర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుమ్కూరు రోడ్డులోని నాగసంద్రలో బెంగళూరు మెట్రో నుంచి భూసేకరణ పూర్తి చేసినట్లు ఐకియా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి సంబంధించి పలు విషయాలను బుధవారం మీడియాకు తెలిపారు. బెంగళూరు ఐకియా స్టోర్ ద్వారా సుమారు 700 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా 1500 మందికి ఉపాధి లభిస్తుందని ఐకియా ప్రతినిధులు అన్నారు. వచ్చే ఏడాది మొదట్లో హైదరాబాద్ స్టోర్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. అసెంబుల్డ్ ఫర్నిచర్ సెగ్మెంట్లో ప్రపంచంలో పేరెన్నికగల స్వీడన్ సంస్థ ఐకియా. అంతర్జాతీయంగా పలు దేశాల్లో రిటైల్,హోల్‌సేల్ ఫర్నిచర్ విభాగంలో ఐకియా పెట్టింది పేరు. పలు గృహోపకరణాలు సైతం ఐకియా స్టోర్లలో లభిస్తాయి.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications