జీఎస్టీ ఎన్‌రోల్‌మెంట్ విండో ప్రారంభం నేటి నుంచే
దేశవ్యాప్తంగా వ్యాపారులు జీఎస్టీ నెట్‌వర్క్ లో నమోదయ్యేందుకు విండోను జూన్ 1 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం వివిధ రంగాల్లో చిన్న,మధ్య తరహా వ్యాపారస్తులు ఉన్నారు. వీరందరినీ
దేశవ్యాప్తంగా వ్యాపారులు జీఎస్టీ నెట్‌వర్క్ లో నమోదయ్యేందుకు విండోను జూన్ 1 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం వివిధ రంగాల్లో చిన్న,మధ్య తరహా వ్యాపారస్తులు ఉన్నారు. వీరందరినీ జీఎస్టీ నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జీఎస్టీ నందు నమోదు అయ్యేందుకు apct.gov.in, gst.gov.in వెబ్‌సైట్లను చూడండి.
జీఎస్టీ నమోదు ఆఖరు తేదీ జూన్ 15 అని గుర్తుంచుకోండి.
జీఎస్టీ వెబ్‌సైట్లో నమోదు అయ్యేందుకు ఈ విధంగా చేయండి

వ్యాపారులు జీఎస్‌టీ చట్టానికి మారేందుకు:
- వ్యాట్, విలాస పన్ను, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, బెట్టింగ్ ట్యాక్స్ చట్టములందు నమోదు కాబడిన వ్యాపారులందరికీ జీఎస్టీఐఎన్(ప్రొవిజనల్ ఐడి) సంఖ్యను వారి వారి ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లకు ప్రభుత్వం పంపించింది.
- జీఎస్టీఐఎన్ (ప్రొవిజనల్ ఐడి), పాస్‌వర్డ్ ఆధారంగా జీఎస్టీ చట్టమునకు మారే అవకాశం ఉంది.
- జీఎస్టీ చట్టానికి మారిన వ్యాపారస్థులు మాత్రమే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) లాంటివి పొందుటకు అర్హత కలిగి ఉంటారు.
- ఈ విధంగా చేసేందుకు వ్యాపారులకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
- వస్తువులు, సేవల పన్ను చట్ట పరిధిలోనికి మారినప్పుడు వారి దరఖాస్తుని తప్పనిసరిగా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లేదా ఈ-సిగ్నేచర్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఈ విధంగా చేయని దరఖాస్తులను సరైన వాటిగా పరిగణించరు అని గుర్తుంచుకోవాలి.
ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది వ్యాపారస్థులు జీఎస్‌టీ చట్టము నందు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకూ జీఎస్టీ నెట్‌వర్క్‌లో చేరనివారు జూన్ 15 లోపు చేరక తప్పదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications