ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం దిశ‌గా ఓలా: ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌పై 50% ఆఫ‌ర్‌

ప్ర‌పంచాన్ని ప‌రిశుభ్రంగా మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్ద‌డం అంత సులువైన విష‌యం కాదు. కానీ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతుగా ప్ర‌కృతికి ఏం చేస్తున్నామా అని ఆలోచిస్తే లోక‌మంతా ప‌చ్చ‌ద‌నంతో నిండుతుంది. దీని గురించ

ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణం దిశ‌గా ఓలా: ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌పై 50% ఆఫ‌ర్
ప్ర‌పంచాన్ని ప‌రిశుభ్రంగా మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్ద‌డం అంత సులువైన విష‌యం కాదు. కానీ ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతుగా ప్ర‌కృతికి ఏం చేస్తున్నామా అని ఆలోచిస్తే లోక‌మంతా ప‌చ్చ‌ద‌నంతో నిండుతుంది. దీని గురించే ఓలా క్యాబ్స్ ఒక ప‌ని చేస్తోంది. ఓలా ఇటీవ‌ల ఒక పైల‌ట్ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టింది. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌లో మొట్ట‌మొద‌టిసారి 200 ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌ను(ఈవీల‌ను) ప్రారంభించింది. ఓలా, మహీంద్రా సంయుక్త ఆధ్వ‌ర్యంలో దీన్ని న‌డిపిస్తున్నారు.
కార్బ‌న్ వాయువుల‌ను త‌గ్గించ‌డం ద్వారా వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించ‌డం దీని ఉద్దేశం. పెట్రోలు , డీజిల్‌కు బ‌దులుగా విద్యుత్‌తో న‌డ‌వ‌డం ఈ కార్ల ప్ర‌త్యేక‌త‌. త‌ద్వారా కాలుష్యం త‌గ్గి గ్రీన్ హౌస్ వాయువుల విడుద‌ల త‌గ్గుతుంది. ఈ త‌ర‌హా కార్ల‌లో రీచార్జీబుల్ బ్యాట‌రీలు ఉంటాయి. అక్క‌డ నుంచి కారు న‌డిచేందుకు అవ‌స‌ర‌మైన శ‌క్తి వ‌స్తుంది. కారులో ఎటువంటి పెట్రోలు,డీజిల్ అనుసంధాన ఇంజిన్ లేకుండా ప‌వ‌ర్ ఆధారిత ఇంజిన్ ఉంటుంది. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులోనూ, ఇంకా 3 ఇత‌ర స్థలాల్లోనూ ఓలా ఎల‌క్ట్రిక్ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. 200 ఎల‌క్ట్రిక‌ల్ అక్క‌డ‌కు వెళ్లి రీచార్జీ చేసుకోవాలి.

 ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల‌తో ఓలా స‌రికొత్త ప్రాజెక్టు

ఎల‌క్ట్రిక్ కార్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు
ఈ కొత్త అధునాత‌న సాంకేతిక‌త కార‌ణంగా ఎంతో డ‌బ్బు మిగులుతుంది. ఎందుకంటే గ్యాస్ కోసం, ఇంధ‌నం కోసం కార్లు బాగా ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా చూసినా ప‌చ్చ‌ద‌నానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఈ కార్ల ద్వారా ప్ర‌తి వ్య‌క్తికీ, స‌మాజానికి ప్ర‌యోజ‌న‌మేంటో తెలుసుకోవాలంటే ఈ ఎల‌క్ట్రిక‌ల్ కార్ కథ‌నంలోకి వెళ్లాల్సిందే.
ఖ‌రీదైన గ్యాస్‌కు స్వ‌స్తి: ఎల‌క్ట్రిక‌ల్ కార్లు పూర్తిగా క‌రెంటుతో చార్జీ చేయ‌బ‌డ‌తాయి. దీంతో మీరు కొంచెం డ‌బ్బు మిగుల్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. గ్యాస్ ఆధారిత కార్ల ప్ర‌యాణంతో పోలిస్తే ఇది త‌క్కువ ఖ‌రీదు కదా!
ఆర్థిక వ్య‌వ‌స్థ‌ప‌రంగా: కేవ‌లం గ్యాస్ చీప్‌గా ఉండ‌ట‌మే కాదు. ఎల‌క్ట్రిక‌ల్ కార్ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం సైతం సబ్సిడీలు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే గోయింగ్ గ్రీన్ ప్ర‌భుత్వ విధానాల్లోనే ఉంటుంది కాబ‌ట్టి.
విష వాయువులు: ఈ వాహ‌నాలు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. వాతావ‌ర‌ణంలోకి పెద్ద‌గా ప్ర‌మాద‌క‌ర‌మైన వాయువులు విడుద‌ల కావ‌ని చెప్ప‌వ‌చ్చు.
విశిష్ట‌మైన డిజైన్‌: ఈ కార్లు జ‌నాల ఆస‌క్తిని ఎలా చూర‌గొంటాయ‌న్న దానిని ఆధారంగా చేసుకుని భ‌విష్య‌త్తులో ఎన్నో ర‌కాల డిజైన్లు రావొచ్చు. ఇంకా కొత్త ఫీచ‌ర్ల ద్వారా కార్ల స్టైల్‌, విలాస వంత‌మైన విధంగా తీర్చిదిద్దుతారు.
మార్కెట్ ప్రైస్ స‌హేతుక‌మే: సాంకేతిక అభివృద్ది కార‌ణంగా కొనుగోలు ఖ‌ర్చు, నిర్వ‌హ‌ణ వ్య‌యం అందుబాటులో ఉంటాయి.
నిర్వ‌హ‌ణ‌కు త‌క్కువే : కార్ మొత్తం విద్యుత్ ఆధారంగా న‌డిచే కార‌ణంగా ఇంజిన్ల‌కు ల్యూబ్రికెంట్ల అవ‌స‌రం లేదు. దీంతో స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. స‌ర్వీస్ స్టేష‌న్ వెళ్లే ప్ర‌యాస త‌ప్పుతుంది.
శ‌బ్ద కాలుష్యం త‌గ్గుతుంది: మిగిలిన కార్ల‌తో పోల్చి చూసిన‌ప్పుడు ఈ త‌ర‌హా కార్లు త‌క్కువ శ‌బ్దం చేస్తాయి. రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు ఎక్కువ శ‌బ్ద కాలుష్యాన్ని క‌లుగ‌జేయ‌వు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+