పార్టిసిపేటరీ నోట్స్ అనగా ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్. దీని అర్దం ఏమిటంటే వీటి సహాయంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం భారతదేశం వెలుపల(విదేశాల నుంచి) ఉపయోగిస్తారు. భారతదేశం కాకుండా విదేశ
పి-నోట్ల రూపంలో నల్లధనం మార్కెట్‌లో ప్రవేశించడాన్ని నిరోధించేందుకు విదేశీ సంస్థలు జారీ చేసే ఒక్కో పి-నోట్‌పై వెయ్యి అమెరికన్ డాలర్ల (రూ.65000) రెగ్యులేటరీ ఫీజును సెబి ప్రతిపాదించింది. అలాగే స్పెక్యులేటివ్ ధోరణిలో పి-నోట్ల జారీని నిలువరించడం కూడా తన లక్ష్యమని తెలిపింది. పి-నోట్లు లేదా ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఉత్పత్తుల (ఒడిఐ) రూపంలో వస్తున్న విదేశీ పెట్టుబడులు ఇప్పటికే నాలుగు నెలల కనిష్ఠ స్థాయి రూ. 1.68 లక్షల కోట్లకు దిగజారిన నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ తాజా చర్యలను ప్రతిపాదించింది. ఒక దశలో స్టాక్‌మార్కెట్‌లోకి పి-నోట్లు, ఒడిఐల రూపంలో వచ్చిన విదేశీ నిధుల పరిమాణం 50 శాతం వరకు ఉండగా ఇప్పుడది కేవలం ఆరు శాతానికి దిగజారింది. ఒడిఐ రూట్‌ను దుర్వినియోగం చేయడాన్ని నివారించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ సోమవారం జారీ చేసిన సంప్రదింపుల(కన్సల్టేషన్) పత్రంలో తెలిపింది. ఈ పత్రాలు ఎవరు తీసుకున్నది, ఇతర ఒడిఐ సబ్‌స్క్రయిబర్ల వివరాలు నమోదు చేసేందుకు అవసరమైన ప్రత్యేక ఐటి పరికరాలను సెబి సమకూర్చుకుందని, ఇప్పుడు అలా గుర్తించిన ఎఫ్‌పిఐలపై రెగ్యులేటరీ ఫీజు కూడా విధించాలనుకుంటున్నామని సెబి తెలియచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలు చేయాలనుకుంటున్న ఈ విధానం కింద ఒక్కో పి-నోట్ పై మూడు సంవత్సరాల కాలానికి వెయ్యి డాలర్ల రెగ్యులేటరీ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

పార్టిసిపేటరీ నోట్ అంటే
పార్టిసిపేటరీ నోట్స్ అనగా ఆఫ్‌షోర్ ఇన్వెస్ట్‌మెంట్. దీని అర్దం ఏమిటంటే వీటి సహాయంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం భారతదేశం వెలుపల(విదేశాల నుంచి) ఉపయోగిస్తారు. భారతదేశం కాకుండా విదేశాల్లో ఏర్పడిన సంస్థలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు(ఎఫ్ఐఐ), విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి మన దేశంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ మార్గం పనికొస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications