జియో కొట్టిన దెబ్బకు ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థలు ఇంకా కోలుకోలేదు. అయితే ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట త్వరలో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్ర
రిలయన్స్ జియో.. భారత టెలికాం రంగంలో ఓ సంచలనం. ''అత్యంత వేగవంతమైన 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఉచితం..'' అంటూ వినియోగదారులను ఆకట్టుకుంది. దీంతో ప్రత్యర్థి సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. జియో కొట్టిన దెబ్బకు ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థలు ఇంకా కోలుకోలేదు. అయితే ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట త్వరలో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దీని గురించిన మరిన్ని పరిణామాలను తెలుసుకుందాం.

ప్రయోగాత్మకంగా ప్రారంభం
ఫైబర్ టు ద హోమ్ పేరిట జియో తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు టెలికాం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే జియో తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ముంబై, పూణెలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. కొంతమంది యూజర్లకు ఇప్పటికే ఉచితంగా ఈ సేవలను జియో అందిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు తమకు జియో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వస్తున్న ఇంటర్నెట్ వేగం వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. అయితే జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికారికంగా ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది మాత్రం తెలియడం లేదు. దీనిపై త్వరలోనే జియో ఒక ప్రకటన చేసే అవకాశముంది.

మొదటి 3 నెలలు ఫ్రీ...
జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత రూ.500, రూ.2వేల ప్లాన్లు రెండింటిని ముందుగా ప్రవేశపెట్టనున్నారు. రూ.500 ప్లాన్‌తో 600 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రూ.2వేల ప్లాన్‌తో 1000 జీబీ డేటా వస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అయితే నిర్దేశించిన డేటా లిమిట్ పూర్తయితే డేటా వేగం తగ్గుతుంది. ఇన్‌స్టాలేషన్, రూటర్ కోసం దాదాపు రూ.4500 వరకూ
వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటే...
జియో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో 5జీబీ సైజ్ గల హెచ్‌డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్, యాక్ట్, హాత్‌వే వంటి ప్రముఖ సంస్థలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక జియో ఫైబర్ వస్తే ఈ సంస్థలు ఎలాంటి ఆఫర్లను ఇస్తాయో వేచి చూడాలి.

జియో రూటర్ సైతం ప్రత్యేకం
సాధారణంగా వైఫై కనెక్షన్ తీసుకునే వారు ఎక్కువగా ఆలోచించేది రూటర్ దగ్గరే. ఈ విషయంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలోనే రూటర్‌ను తీసుకొచ్చే యోచనలో జియో ఉన్నట్లు సమాచారం. మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే రీఫండబుల్ డిపాజిట్‌తో ప్రతి యూజర్‌కు వైఫై రూటర్‌ను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ క్రమంలో ఏ ఇతర కంపెనీ రూటర్ వెనక్కు ఇచ్చినా జియో రూటర్ ఉచితం అని రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమెరికాలో అలా... భారత్‌లో ఇలా...
అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లో ప్రజలు బ్రాడ్‌బ్యాండ్ తప్పనిసరి అవసరంగా భావించే పరిస్థితి ఉంది. అయితే భారత్‌లో ఇది భిన్నంగా ఉందనే చెప్పుకోవాలి. అవసరమైతే తప్ప బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకునేందుకు చాలా మంది అంతర్జాల వినియోగదార్లు సిద్దంగా లేరు. ఇందుకు ప్రధాన కారణం బ్రాడ్‌బ్యాండ్ ధరలు ఎక్కువ ఉండటం. దేశంలో 20 కోట్ల మంది మాత్రమే బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే డేటా విపరీతమైన వేగంతో అందించడంతో పాటు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు పావులు కదుపుతుండటంతో ఇంటింటా బ్రాడ్‌బ్యాండ్ విస్తరిస్తుందో లేదో వేచి చూడాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications