బ‌ల‌హీన ఫ‌లితాల నేప‌థ్యంలో బాగా ప‌డ్డ టెక్ఎమ్ షేర్

టెక్ మ‌హీంద్రా షేర్ సోమ‌వారం దాదాపు 12% ప‌త‌న‌మై రూ. 357.60 స్థాయికి చేరింది. అక్టోబ‌ర్8, 2013ఈ సంస్థ షేరు ఇంత త‌క్కువ ధ‌ర‌ను చేర‌డం మ‌ళ్లీ ఇదే. 2008 జ‌న‌వ‌రిలో 16.7% క్షీణించిన త‌ర్వాత ఈ స్థాయి ప‌త‌

టెక్ మ‌హీంద్రా షేర్ సోమ‌వారం దాదాపు 12% ప‌త‌న‌మై రూ. 357.60 స్థాయికి చేరింది. అక్టోబ‌ర్8, 2013 త‌దుప‌రి ఈ సంస్థ షేరు ఇంత త‌క్కువ ధ‌ర‌ను చేర‌డం మ‌ళ్లీ ఇదే. 2008 జ‌న‌వ‌రిలో 16.7% క్షీణించిన త‌ర్వాత ఈ స్థాయి ప‌త‌నం ఇదే. కంపెనీ ఆశించిన దాని కంటే బ‌లహీనంగా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌డ‌మే ఇందుకు కార‌ణం. బీఎస్ఈ సెన్సెక్స్‌లో చివ‌ర‌కు టెక్ఎమ్ షేరు 379.30 వ‌ద్ద ముగిసింది. దాదాపు 50 రూపాయ‌ల‌కు పైగా న‌ష్ట‌పోయింది. దీంతో మొత్తానికి ఈ ఏడాదిలో ఈ సంస్థ షేర్ ధ‌ర‌ల 22.2% క్షీణించిన‌ట్ల‌యింది.

దారుణంగా ప‌డిపోయిన టెక్ మ‌హీంద్రా షేర్‌

మార్చి 31,2017తో ముగిసిన త్రైమాసికానికి సంస్థ ఏకీకృత నిక‌ర లాభం 31.2% ప‌డిపోయి రూ.590 కోట్లుగా న‌మోద‌యింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో క‌నీసం రూ.783 కోట్ల లాభాన్ని అంచ‌నా వేశారు. అయితే సంస్థ రెవెన్యూలు మాత్రం 9% పెరిగి రూ.74.95 కోట్లుగా ప్ర‌క‌టించ‌డం కాస్త సంతోషం క‌లిగించే విష‌యం. బ్లూమ్ బ‌ర్గ్ వెబ్సైట్ రెక‌మెండేష‌న్స్ ప్ర‌కారం 34 మంది విశ్లేష‌కులు దీన్ని కొనాల‌ని సూచించ‌గా; 9 మంది హోల్డ్ చేయాల‌ని చెప్ప‌గా ; మ‌రో 7 మంది మాత్రం టెక్ ఎమ్ షేరును అమ్మాల్సిందేన‌ని చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+