రెండు బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ ఆన్‌లైన్‌లో చేయడం ఎలా?
ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్) విధానంలో నగదు బదిలీ బ్యాచ్‌ల వారీగా జరుగుతుంది. దీనికి కాస్త సమయం పడుతుంది. నిర్ణీత వేళలు ఉన్నాయి. తక్షణమే నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగపడే సేవే ఐఎంపీఎస్. ఈ స
ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్) విధానంలో నగదు బదిలీ బ్యాచ్‌ల వారీగా జరుగుతుంది. దీనికి కాస్త సమయం పడుతుంది. నిర్ణీత వేళలు ఉన్నాయి. తక్షణమే నగదు బదిలీ చేసుకునేందుకు ఉపయోగపడే సేవే ఐఎంపీఎస్. ఈ సేవను వినియోగించుకోవాలని అనుకునేవారు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును కలిగి ఉండాలి. ఎంఎంఐడీ, ఎంపిన్ ద్వారా సైతం ఐఎంపీఎస్లో నగదు బదిలీ జరుగుతుంది. లేదా బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉన్నా తక్షణమే ఖాతాను జమ చేసుకుని ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీన్ని డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్,టాబ్లెట్ లేదా మొబైల్ దేనిలోనైనా వాడుకోవచ్చు. ఏటీఎమ్‌ల్లో సైతం పేరు ఇది కాకపోయినా తక్షణమే నగదు బదిలీ చేసేందుకు కొన్ని బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి.

ఐఎంపీఎస్ ప్రత్యేకత ఏంటంటే 24/7 ఎప్పుడైనా నగదు బదిలీకి వీలుంటుంది. ఈ సేవ ద్వారా నగదు వేరేవాళ్లకు పంపాలన్నా, మరొక ఖాతా నుంచి మీరు పొందాల్సి ఉన్నా రెండు ఖాతాలు ఈ సేవ కింద నమోదయి ఉండాలి. లబ్దిదారు మొబైల్ నంబరు ద్వారా నగదు బదిలీ చేసే విధానం కోసం ఎంఎంఐడీ పద్దతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి ఖాతాకు, సంబంధిత ఖాతాదారు మొబైల్ నంబరుతో అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక 7 అంకెలను కేటాయిస్తారు. దీన్నే ఎంఎంఐడీ అంటారు. ఎంఎంఐడీని మీ నెట్‌బ్యాంకింగ్ ద్వారా తక్షణమే పొందవచ్చు. ఒకసారి లబ్దిదారును జత చేసుకున్న తర్వాత గరిష్టంగా రూ.1 లక్ష ట్రాన్స్‌ఫర్ చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications