భారీ లాభాల దిశగా దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 448 పాయింట్లు దూసుకెళ్లి 30,750 వద్ద నిలిచింది. చివర్లో 30,793ను
దేశీయ ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 448 పాయింట్లు దూసుకెళ్లి 30,750 వద్ద నిలిచింది. చివర్లో 30,793ను తాకడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. నిఫ్టీ సైతం 149 పాయింట్లు జంప్‌చేసి 9,510 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 9,523కు చేరడం ద్వారా కొత్త గరిష్టానికి చేరువైంది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 3 శాతం ఎగసి 23,190 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 23,267 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

బ్యాంకింగ్ రంగ హవా
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకుల షేర్ల కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తిచూపడం స్పష్టంగా కనిపించింది. సెన్సెక్స్ షేర్లలో ఎల్ అండ్ టీ(4.97%), ఐసీఐసీఐ బ్యాంకు(3.5%), హెచ్‌డీఎఫ్‌సీ(3.04%), ఇన్ఫోసిస్(2.9%), గెయిల్(2.8%), టీసీఎస్(2.4%), ఎస్‌బీఐ(2.4%), ఎం అండ్ ఎం(2.08%), విప్రో(1.9%), మారుతి(1.8%), బజాజ్ ఆటో(1.80%) లాభపడగా డిష్ టీవీ(11.21%), వీడియోకాన్ ఇండస్ట్రీస్(9.94%), లుపిన్(7.31%), డెన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్(4.15%), ఏఐఏ ఇంజినీరింగ్ లిమిటెడ్(3.86%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి


Click it and Unblock the Notifications