బెంగుళూరు మహానగరంలోని బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న 76 పరిశ్రమలను మూసివేసేలా చూడాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆయా పరిశ్రమలకు తక్షణమే నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపి వేయాల
బెంగుళూరు మహానగరంలోని బెల్లందూర్ లేక్ చుట్టూ ఉన్న 76 పరిశ్రమలను మూసివేసేలా చూడాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆయా పరిశ్రమలకు తక్షణమే నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపి వేయాల్సిందిగా నగర డెప్యూటీ కమీషనర్‌ను ఆదేశిస్తూ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతే కాకుండా లేక్‌కు దగ్గరలో ఉన్న హౌసింగ్ సొసైటీలు, నివాస గృహ సముదాయాల్లో ఉండే వారు అక్కడే సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఈ విధంగా ఏర్పాటు లేకపోతే వాటికి కూడా విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాల్సి వస్తుందని చెప్పింది.

లేక్‌కు సమీపంలో ఉన్న హౌసింగ్ సొసైటీలు, నివాస సముదాయాలు ఏర్పాటు చేసిన సీవరేజీ ప్లాంట్లను బెంగుళూరు జల మండలి, సీవరేజీ బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అధికారులతో కూడిన ఉమ్మడి అధికారుల బృందం తనిఖీలు నిర్వహించాలని ఎన్‌జీటీ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం సూచించిన పరామితులతో కూడిన సీవరేజీ ప్లాంట్లే పనిచేసేలా చూడాలని లేనియెడల అక్కడ ఉండే ఇళ్లకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలను నిలిపివేయాల్సిందేనని ఎన్‌జీటీ పేర్కొంది. ఇందుకు కొంత సమయం ఇవ్వాలని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications