ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2017-18లో దేశవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పథకంలో భాగంగా 2016-17లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 1.49
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2017-18లో దేశవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పథకంలో భాగంగా 2016-17లో నిర్మించిన ఇళ్ల సంఖ్య 1.49లక్షలు కావడం గమనార్హం. ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించారు.

2018-19లో 26 లక్షలు, 2019-20లో 26 లక్షలు, 2020-21లో 30 లక్షలు, 2021-22లో 29.80 లక్షల ఇళ్లను నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం చాలా నిదానంగా సాగేందుకు భూసేకరణ ఆలస్యంగా జరగడమే కారణమని చెప్పారు. ఇప్పటివరకూ 18.76 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రాగా, 13.06 లక్షల ఇళ్లకు నిధులు విడుదలయ్యాయి. అయితే భూసేకరణలో ఆలస్యం కారణంగా కేవలం 1.49 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇది 2016-17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పురోగతి అని ఆయన చెప్పారు. 2015 జూన్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. 2022 కల్లా అందరికీ ఇళ్లు ఉండాలనేది ఈ పథకం లక్ష్యం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications