నగదు లావాదేవీలకు సంబంధించి రుసుములను మార్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని విత్‌డ్రాయల్స్‌కు చార్జీలు ఉండవని ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ బడ్డీలో ఉండే సొమ్మును ఏటీఎమ్ ద్వారా తీసుకోవాలనుకు
నగదు లావాదేవీలకు సంబంధించి రుసుములను మార్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని విత్‌డ్రాయల్స్‌కు చార్జీలు ఉండవని ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ బడ్డీలో ఉండే సొమ్మును ఏటీఎమ్ ద్వారా తీసుకోవాలనుకుంటే రూ.25 రుసుము ఉంటుందన్నారు. ఖాతాలో సొమ్మును ఏటీఎమ్ ద్వారా విత్‌డ్రా చేసేందుకు గల నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతా, జన్ ధన్ ఖాతాల విషయంలో ఏటీఎమ్ నుంచి 4 విత్‌డ్రాయల్స్‌కు పరిమితి ఉంది. ఇతర పొదపు ఖాతాల విషయంలో ఈ పరిమితి 8 లావాదేవీలుగా ఉంది. మొత్తం 8 లావాదేవీల్లో(5 ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల్లో, 3 ఇతర బ్యాంకు ఏటీఎమ్‌ల్లో) ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో అయితే 8, నాన్ మెట్రో నగరాల్లో అయితే 10 లావాదేవీలు ఉచితం. నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ల్లో 5, ఇతర ఏటీఎమ్‌ల్లో 5 విత్‌డ్రాయల్స్ చేసుకునే ఉచిత సదుపాయం ఉంది.

అంతే కాకుండా ఇకపై ఖాతాదార్లు బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా సైతం మొబైల్ వాలెట్లో డబ్బు జమ చేయవచ్చు, విత్ డ్రా చేసుకోవచ్చు. వాలెట్లకు సేవా రుసుములు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ ఎండీ రజనీష్ కుమార్ చెప్పారు. ఎస్‌బీఐ గతేడాది నాలుగో త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2815 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం అదే త్రైమాసికంలో నికర లాభం రూ.1264 కోట్ల కంటే ఇది 112.72% ఎక్కువ. 2017 నాలుగో త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 57,720 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది అదే సమయంలో ఉన్న రూ. 53,526 కోట్లతో పోలిస్తే 7.8% ఎక్కువ. అయితే నిరర్ధక ఆస్తులకు సంబంధించి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎప్‌పీఏలు రూ. 1,12,343 కోట్లకు పెరిగాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications