For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో నెట్‌వ‌ర్క్ నుంచి చేజారుతున్నారా?

సంచ‌ల‌నాల మ‌ధ్య ప్రారంభ‌మైన దేశీయ టెలికాం సంస్థ చాలా త‌క్కువ కాలంలోనే 10 కోట్ల వినియోగ‌దారుల‌ను సంపాదించింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచేట‌ట్లు లేదు. గత ఆరు నెలలుగా జియో ప్రతిభ మసకబారుతున్నట్టు హాం

|

సంచ‌ల‌నాల మ‌ధ్య ప్రారంభ‌మైన దేశీయ టెలికాం సంస్థ చాలా త‌క్కువ కాలంలోనే 10 కోట్ల వినియోగ‌దారుల‌ను సంపాదించింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచేట‌ట్లు లేదు. గత ఆరు నెలలుగా జియో ప్రతిభ మసకబారుతున్నట్టు హాంకాంగ్‌కు చెందిన యూబీఎస్ సెక్యూరిటీస్ ఆసియా సోమవారం వెల్ల‌డించింది.

జియో నుంచి వినియోగ‌దారులు త‌ప్పుకుంటున్నారా?

టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన ఆరు నెలల గణాంకాలను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చింది. మార్చి నెలలో జియోకు అదనంగా 50.8 లక్షల మంది వినియోగదారులు మాత్రమే వచ్చి చేశారు. అదే ఫిబ్రవరిలో 1.22 కోట్లు, జనవరిలో 1.84కోట్ల మంది వినియోగదారులు కొత్తగా వచ్చారు. అంటే ప్రతినెల జియోకు వచ్చే వినియోగదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా అక్టోబరు 2016 నుంచి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో జియోకు వచ్చే వినియోగదారుల సంఖ్యగా గణనీయంగా పడిపోయినట్టు తేలింది.

జియో నుంచి వినియోగ‌దారులు త‌ప్పుకుంటున్నారా?

గడచిన నెలలతో పోలిస్తే మార్చిలో జియోకు కొత్తగా జ‌త‌ చేరిన వినియోగదారుల సంఖ్య అతి స్వల్పమని యూబీఎస్ పేర్కొంది. గతేడాది నవంబరులో 1.62 కోట్లు, డిసెంబరులో 2.02 కోట్లు, జనవరిలో1.84 కోట్లు, ఫిబ్రవరిలో 1.22 కోట్ల మంది కొత్త వినియోగదారులు జియో నెట్వ‌ర్క్‌లో చేరారు. అయితే ఒక్క జియోకు మాత్రమే ఇది పరిమితం కాలేదని, భారతీ ఎయిర్‌టెల్ మార్చిలో కేవలం 30.58 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నట్టు విశ్లేషించింది. వొడాఫోన్, ఐడియా సెల్యులర్ సంస్థ‌లు కూడా త‌క్కువ‌ వినియోగదారులను ఆక‌ర్షించాయ‌ని పేర్కొంది. మార్చిలో వొడాఫోన్ 20.10 లక్షలమందిని, ఐడియా 10.83 లక్షల మందిని కొత్తగా సాధించింది.

Read more about: jio telecom
English summary

జియో నెట్‌వ‌ర్క్ నుంచి చేజారుతున్నారా? | Is reliance jio bright image is shrinking

New telecom entrant Reliance Jio’s subscribers’ tally slowed down over a six-month period with only 5.8 million new additions in March, Hong Kong-based UBS Monday said.
Story first published: Monday, May 22, 2017, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X