జీఎస్టీ కారణంగా బీమా ప్రీమియంలు 3% పెరుగుతాయ్
బీమా సైతం ఆర్థిక సేవల్లో భాగం కాబట్టి ఈ రంగం సైతం జీఎస్టీ తర్వాత 18% పన్ను పరిధిలోకి వస్తుంది. దీంతో బీమా పాలసీలకు సంబంధించి చెల్లించే ప్రీమియంలో ప్రత్యక్ష ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇ
బీమా సైతం ఆర్థిక సేవల్లో భాగం కాబట్టి ఈ రంగం సైతం జీఎస్టీ తర్వాత 18% పన్ను పరిధిలోకి వస్తుంది. దీంతో బీమా పాలసీలకు సంబంధించి చెల్లించే ప్రీమియంలో ప్రత్యక్ష ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియంలకు సంబంధించి సేవా పన్ను, సెస్సుతో కలిపి 15% పన్ను వర్తిస్తున్నది. పరిశ్రమ నిపుణులు మాట్లాడుతూ జీఎస్టీ తర్వాత పెరిగే పన్నుతో వినియోగదారులు ప్

అదనపు పన్ను(18%) కారణంగా బీమాదార్లు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సీఈవో అమితాబ్ ఛౌదరి చెప్పారు. బీమా పరిశ్రమకు చెందిన పలువురు ముఖ్యులు ఇంతకు మునుపే జీఎస్టీ కౌన్సిల్‌ను కలిసి ఈ రంగానికి 5% పన్నును అమలు చేయాల్సిందిగా కోరగా ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ తిరస్కరించింది. ఆర్థిక సేవల రంగంలో అన్నింటికీ 18% ఏకీకృత పన్నును అమలు చేయనున్నారు. బీమా రంగంలో అత్యధిక వాటా కలిగిన ఎల్ఐసీ తక్షణమే ఈ భారాన్ని కస్టమర్లకు బదలాయించే అవకాశం ఉన్నందున బీమా రంగంలో కాస్త అసంతృప్తి ఉండే అవకాశం లేకపోలేదు. కనీసం డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రీమియంలను చెల్లించిన వారికి ఏదైనా తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని భావించినా, రెండు రోజుల జీఎస్‌టీ సమావేశం ఈ దిశగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications