జీఎస్‌టీ తర్వాత బ్యాంకు రుసుములు పెరుగుతాయా?
జీఎస్‌టీ అమలు తర్వాత ఆర్థిక సేవలు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్రభుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవలపై 18% పన్ను నిర్ణయించడంతో ట్రాన్సాక్షన్ రుసుములను సైతం మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు
జీఎస్‌టీ అమలు తర్వాత ఆర్థిక సేవలు సైతం కాస్త ప్రియం కానున్నాయి. ప్రభుత్వం జీఎస్టీలో ఆర్థిక సేవలపై 18% పన్ను నిర్ణయించడంతో ట్రాన్సాక్షన్ రుసుములను సైతం మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు. ఇదివరకూ ఇవన్నీ 15% పన్ను పరిధిలో ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవలన్నీ 18 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. దీంతో ఇప్పుడు చెల్లించే ప్రతి రూ. 100కు అదనంగా రూ.3 మనం ఎక్కువగా భరించాల్సిందేనని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కంపెనీల తరపున ఆర్థిక సంస్థలు ఈ అదనపు భారాన్ని తమ ఖర్చులోనే భాగం చేసుకునే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల విషయంలో మాత్రం కచ్చితంగా ఆ భారం వారే మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం 1211 వస్తు,సేవల రేట్లను జీఎస్టీ చట్టంలో భాగంగా ఖరారు చేసేసింది. ఎక్కువ శాతం వస్తు, సేవలు 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. ఆర్థిక సేవలతో పాటు ఏసీ హోటళ్లు, లిక్కర్, టెలికాం, ఐటీ సేవలు, బ్రాండెడ్ దుస్తులు, రిఫైన్‌డ్ పంచదార, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, పేస్త్రీలు, కేకులు, నిల్వ ఉంచే కూరగాయలు, జామ్‌లు, సాస్‌లు, ఐస్ క్రీమ్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌లు, మినరల్ వాటర్, టిస్యూలు, ఎన్వలప్‌లు, నోటు పుస్తకాలు వంటివి 18% పరిధిలోకి వచ్చిన వాటిలో ఉన్నాయని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications